రాష్ట్రీయం

విద్యారంగంలో అంతర్జాతీయకరణ అత్యవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 5: నేడు హింసాత్మక ధోరణులు ప్రజలకు శాంతిని దూరం చేస్తున్నాయని, ఇది ప్రమాదకర సంకేతాలని వీటిని అధిగమించడంపై విశ్వవిద్యాలయాలు దృష్టిసారించాల్సిన అవసరం ఉందని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టిబెటన్ హయ్యర్ స్టడీస్ సారానాథ్ మాజీ విసి, మాజీ పిఎం ఆఫ్ సెంట్రల్ టిబిటెన్ అడ్మినిస్ట్రేషన్ ఆచార్య సాంధోంగ్ రిన్‌పచీ స్పష్టం చేశారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీ శ్రీనివాస ఆడిటోరియంలో ఆదివారం భారతీయ విశ్వవిద్యాలయాల సమాఖ్య 91వ వార్షిక సాధారణ సమావేశం ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో తొలిరోజున ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి ధార్మిక చింతనలో భారతదేశం ఒక జగద్గురువుగా వ్యవహరించిందని అన్నారు. భారతదేశ ఐక్యత, విలువలను తిరిగి పెంపొందించే దిశగా విశ్వవిద్యాలయాలు కృషి చేయాలన్నారు. హింసాత్మక ధోరణులు ప్రజలకు శాంతిని దూరం చేస్తున్నాయన్నారు. అసోసియేషన్ ఆఫ్ కామెన్‌వెల్త్ యూనివర్శిటీస్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ కిర్కిలాండ్ మాట్లాడుతూ నేడు యావత్ ప్రపంచం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందనడంలో సందేహం లేదన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువు పూర్తిచేసుకుని బయటకు వస్తున్న వారికి అవసరమైన ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. దీంతోపాటు సామాజిక, ఆర్థిక అసమానతలు పెరుగుతుండటంతో హింస, ఉగ్రవాదం పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యతో ఈసమస్యలు పరిష్కారం కావాల్సి ఉందన్నారు. యువతకు ఉద్యోగాలు చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కొనాలంటే విద్యారంగంలో ఎవరికివారే యమునాతీరే అన్నట్లుగా కాకుండా అంతర్జాతీయకరణ అవసరమని చెప్పారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య విజయరాజు మాట్లాడుతూ విద్య మానవ జీవితంలో కనీస అవసరంగా గుర్తించాలని అన్నారు. ఏ రంగానికైనా విద్య కనీస ప్రమాణంగా నిలుస్తుందని ఆయన చెప్పారు. ఈసందర్భంగా ఏఐయూ రూపొందించిన న్యూస్ లెటర్‌ను అతిధులు ఆవిష్కరించారు.