రాష్ట్రీయం

పంపకాలపై పంచాయితీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: ఆస్తుల పంపకాలకు సంబంధించి ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సమక్షంలో గురువారం ఆంధ్ర, తెలంగాణ మంత్రులు మరోసారి సమావేశం అవుతున్నారు. ఈనెల 1న రెండు రాష్ట్రాల మంత్రుల సమావేశం గవర్నర్ వద్ద జరిగిన విషయం తెలిసిందే. ఏపీ పునర్విభజన చట్టంలో 9, 10 షెడ్యూల్‌లోని వివిధ సంస్థల కార్యాలయాల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపకంపై రెండున్నరేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై సమావేశంలో మరోసారి చర్చిస్తారు. ఇప్పటికే మొత్తం 12 సంస్ధలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఇందులో 9 బీసీ కులాలకు చెందిన సంస్ధలు, మూడు పరిశ్రమ, వాణిజ్య సంస్థలున్నాయి. 9వ షెడ్యూల్‌లోని నారుూ బ్రాహ్మణ సహకార సంఘ సమాఖ్య, రజక సహకార సమాఖ్య, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, సాగర సహకార సంఘం, వాల్మీకి బోయ సహకార సంఘం, కృష్ణ బలిజ పూసల సహకార సంఘం, భట్రాజ, సహకార సంఘం, మేదర సహకార సంఘం, కల్లు గీత కార్మికుల సహకార సంఘం, విశ్వ బ్రాహ్మణ సహకార సంఘం, కుమ్మరి శాలివాహన సహకార సంఘాల విభజనపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆంధ్రకు కేటాయించిన నాల్గవ తరగతి ఉద్యోగులు వెయ్యిమందిని తెలంగాణకు బదలాయించే విషయమై కూడా చర్చ జరగనుంది. కీలకమైన ఆర్టీసీ, ఉన్నత విద్య మండలి తదితర సంస్థల విభజనపై గురువారం రెండు రాష్ట్రాల మంత్రులు చర్చించనున్నారు.