రాష్ట్రీయం

‘సమితి’తో ఎంవోయూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 11: ఐక్యరాజ్య సమితి మహిళా విభాగంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం మహిళలకు సంబంధించి ప్రభుత్వం ఖర్చుచేసే నిధులకు ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం సహకారం అందించనుంది. స్ర్తి, పురుష సమానత్వంతోనే సమాజాలు ఆర్థికంగా వృద్ధి చెందుతాయని ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం ప్రతినిధి ఆసాటొర్కెల్సన్ చెప్పారు. ఆనందమయ సమాజానికి ఇది పునాదులు వేస్తుందన్నారు. లింగ వివక్ష కలిగిన సమాజాలు వృద్ధి చెందవని తేల్చి చెప్పారు. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లోనూ మహిళా సాధికారత గురించే ప్రధానంగా నిబంధన రూపొందించామని ఆమె వివరించారు.