రాష్ట్రీయం

అన్నవరంలో పురోహితుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంఖవరం, జనవరి 6: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో వ్రత పురోహితులపై ఆలయ కార్యనిర్వహణాధికారి (ఇఒ) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనితో బుధవారం వ్రత పురోహితులు నిరసన వ్యక్తంచేశారు. ఆలయ ఇఒ కాకర్ల నాగేశ్వరరావు ప్రతి నెలా మొదటి మంగళవారం ‘డయల్ యువర్ ఇఒ’ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. భక్తులు తన దృష్టికి తీసుకువచ్చే సమస్యలపై ఇఒ ఈ కార్యక్రమం ద్వారా స్పందిస్తుంటారు. ఈ కార్యక్రమంలో ఒక భక్తుడు అన్నవరం ఆలయంలో వ్రతం చేయించుకునే భక్తుల నుండి డబ్బులు డిమాండు చేస్తున్నారని ఇఒకు ఫిర్యాదుచేశారు.
అనంతరం ఇఒ ‘్భక్తుల నుండి డబ్బులు అడుక్కునేది మాంసం ముక్కలు తినడానికేనా’ అని వ్రత పురోహితులనుద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా ఇఒ వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆగ్రహిస్తూ వ్రత పురోహితులు బుధవారం ఆలయం వద్ద నిరసనకు దిగారు. ఇఒ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, తమకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని వ్రత పురోహితుల సంఘం అధ్యక్షుడు కర్రి నాని హెచ్చరించారు. అంతకు ముందు వారు జిల్లాకు చెందిన రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకు ఇఒపై ఫిర్యాదుచేశారు. ఈ ఘటనపై ఇఒ నాగేశ్వరరావును వివరణ కోరగా భక్తులు చేసిన ఫిర్యాదుపై ఒకరిద్దరిని ఉద్దేశించి తాను వ్యాఖ్యానించానని, పురోహితుల వ్యవస్థను కించపరిచే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. పురోహితులపై తనకు అపారమైన గౌరవం ఉందని, దేవస్థానం గౌరవ ప్రతిష్ఠలు పెంచేందుకే తాను కృషి చేస్తున్నానన్నారు. ఒకవేళ తన వ్యాఖ్యల వల్ల ఎవరికైనా బాధ కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇఓ వ్యాఖ్యలపై నిరసన తెలుపుతున్న వ్రత పురోహితులు