రాష్ట్రీయం

త్వరలో ‘తల్లికి వందనం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 12: తల్లులను గౌరవించే సంప్రదాయానికి శ్రీకారం చుడుతూ త్వరలో ‘తల్లికి వందనం’ కార్యక్రమం అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. లింగ వివక్ష ఒకనాటి మాట అని, లింగ సమానత నేటిమాట అని అన్నారు. విజయవాడ పవిత్ర సంగమం వద్ద జాతీయ మహిళా పార్లమెంట్ ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ఇండోనేసియా, ఫిన్‌లాండ్ దేశాల్లో తల్లులను ఏడాదిలో ఒకరోజు గౌరవిస్తారని తెలిపారు. దేశంలో కొన్ని చోట్ల కూడా ఇలా తల్లులను విద్యార్థులు పూజిస్తారని తెలిపారు. అదే తరహాలో రాష్ట్రంలో తల్లికి వందనం పేరుతో ఒక కార్యక్రమాన్ని అమలు చేసేందుకు త్వరలో ఒక తేదీ నిర్ణయిస్తామన్నారు. ఆ రోజు పాఠశాలల్లో, కళాశాలల్లో తల్లులను ఆయా విద్యార్థులు తమ తల్లులకు పాదపూజ చేసి, వారి ఆశీస్సులు తీసుకుంటారని తెలిపారు. అమరావతిలో నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంట్‌కు విశేష స్పందన లభించిందన్నారు. దాదాపు 22 వేల మంది పాల్గొన్నారన్నారు. మహిళా సాధికారతపై సదస్సు నిర్వహించే అవకాశం తనకు దేవుడు ఇచ్చాడని, చరిత్రలో ఇది మిగిలిపోతుందని అన్నారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం లేకనే ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తోందన్నారు. గతంలో లింగ ఆసమానత ఉండేదని, కానీ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కారణంగా లింగ సమానత వచ్చిందన్నారు. పురుషులకు మహిళలు ఎందులోనూ తీసిపోరన్నారు. మహిళా పార్లమెంట్‌పై గూగుల్‌లో 6 కోట్ల ఇంప్రెషన్స్ నమోదు అయ్యాయన్నారు. మహిళా సాధికారత అంటే ఏమిటని సర్వే నిర్వహించగా, 28 శాతం మంది.. మహిళలను గౌరవించడమేనంటూ స్పందించారన్నారు. 13 శాతం మంది తనకు అభిరుచి ఉన్న రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛ అని, 10 శాతం మంది ఉపాధి, ఉద్యోగాల్లో వివక్ష లేకపోవడంగా పేర్కొన్నారన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఈ సదస్సు ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నట్టు ప్రకటించారు.
3 నెలల్లో అమరావతి డిక్లరేషన్
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు బాధ్యత వహించాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఇందుకు అవసరమైన రాజకీయ మద్దతును, ప్రజాభిప్రాయాన్ని సమీకరిస్తామని హామీ ఇచ్చారు. అమరావతిలో నిర్వహించిన జాతీయ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు పలుకుతూ మహిళా పార్లమెంట్ ఏకగ్రీవంగా అభిప్రాయం వ్యక్తం చేసిందన్నారు. మూడు నెలల్లో అమరావతి డిక్లరేషన్ ప్రకటించనున్నామని సిఎం తెలిపారు. ఈ సదస్సులో తీసుకున్న నిర్ణయాలు, తదితర అంశాలపై ఐక్యరాజ్య సమితి ఆసక్తి కనబరించిందన్నారు. ఈ మేరకు మూడు నెలల్లో ఐక్యరాజ్య సమితికి అమరావతి డిక్లరేషన్‌ను ఇస్తామన్నారు.
అత్తగారి మద్దతుతోనే...
లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను మరో దుర్గామాతగా సిఎం అభివర్ణించారు. లోక్‌సభలో ఆమె దుర్గామాతగా సభను నడిపిస్తారన్నారు. పెళ్లి చేసుకున్నాక ఉన్నత చదువులు చదివి, ఏడుసార్లు పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారని కొనియాడారు. తనకు అత్తగారు మద్దతు ఇచ్చినందునే ఈ స్థాయికి చేరగలిగానని ఆమె తనతో అన్నారని గుర్తు చేశారు. అటువంటి అత్తగార్లు అందరికీ కావాలని అనుకుంటారన్నారు.