రాష్ట్రీయం

హైందవ ధర్మమే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12:్భరతదేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శమైనవని ఆధ్యాత్మిక బౌద్ధగురువు దలైలామా అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ (హైటెక్ సిటీ) దక్షిణాసియాకు కేంద్రంగా ఉండే ‘దలైలామా సెంటర్ ఫర్ ఎథిక్స్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ వాల్యూస్’ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ‘సంప్రదాయాలు-విలువలు, మంచితనంతో మనుగడ’ అంశంపై మాట్లాడుతూ భారతదేశం పుణ్యభూమి అని, తరతరాల నుండి నైతిక విలువలు, నీతి, ధర్మం, న్యాయం గురించి విశ్వానికే బోధించిన దేశమని ఆయన కొనియాడారు. భూతాపాన్ని అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మత సామరస్యానికి భారతదేశం పెట్టింది పేరని, ఈ దేశంలో నివసిస్తున్న ముస్లింలకు పూర్తి భద్రత ఉందని దలైలామా అన్నారు. ఇక్కడి ముస్లింలు ఇతర మతస్థులతో కలిసి సహజీవనం సాగించడం గమనార్హమన్నారు. ప్రపంచంలోని దేశాల మధ్య సత్సంబంధాలు ఉండాలని దలైలామా పిలుపు ఇచ్చారు. రెండు పొరుగు దేశాల మధ్య గోడలాంటి కట్టడాలు కడితే బంధాలు తెగిపోతాయన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విధంగా యుఎస్‌ఎ-మెక్సికో దేశాల మధ్య గోడ కట్టడం వల్ల ప్రయోజనం ఉండబోదని, అందుకు బదులుగా రెండు దేశాల మధ్య సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. యూరోపియన్ యూనియన్‌లో వివిధ దేశాలున్నాయని, వాటి మధ్య ఐకమత్యాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. యూరోపియన్ యూనియన్ మాదిరిగానే ఆఫ్రికన్ యూనియన్, లాటిన్ అమెరికా ఏర్పాటై అభివృద్ధిపథంలో నడవవచ్చన్నారు. ఆసియాలో పెద్దదేశాలైన భారత్-చైనా కూడా ఒక యూనియన్‌గా ఏర్పడితే బాగుంటుందన్నారు. ప్రపంచంలోని దేశాలన్నీ ఒక యూనియన్‌గా ఏర్పడితే విశ్వశాంతి ఏర్పడుతుందని సూచించారు. 21వ శతాబ్దిని చర్చల శతాబ్దిగా మార్చుకోవాలని కోరారు.
ఉచితంగా స్థలం-ఐదు కోట్లు:కెటిఆర్
దక్షిణాసియాకు కేంద్ర బిందువుగా దలైలామా సెంటర్ ఫర్ ఎథిక్స్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం పట్ల తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటి మంత్రి కె తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. ఈ భవనం కోసం అవసరమైన స్థలాన్ని ఉచితంగా ఇస్తున్నామని, అలాగే భవన నిర్మాణానికి ఐదుకోట్ల రూపాయలు విరాళంగా ఇస్తామని ప్రకటించారు. భారత్‌లోని యువతను సామాజిక సేవకులుగా రూపొందించేందుకు, వర్తమాన, భవిష్యత్తులో ఉన్నతభావాలు, ఆదర్శాలు కలిగిన నాయకులుగా రూపొందించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం దలైలామా కేంద్రం ఉపయోగపడాలని కెటిఆర్ ఆకాంక్షించారు.
గవర్నర్ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లో ‘దలైలామా సెంటర్ ఫర్ ఎథిక్స్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ వాల్యూస్’ భవనానికి శంకుస్థాపన అనంతరం మాట్లాడుతున్న దలైలామా