రాష్ట్రీయం

భవనాల అప్పగింతకు లైన్ క్లియర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: సచివాలయం, ఇతర ప్రభుత్వ భవనాలు, క్వార్టర్ల అప్పగింతపై గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో ఆదివారం చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధీనంలో హైదరాబాద్‌లో ఉన్న భవనాల అప్పగింతపై గవర్నర్ ముందుగా చంద్రబాబుతో చర్చించిన విషయం తెలిసిందే.
అదే విషయమై ఆయన ఆదివారం పొద్దుపోయాక కెసిఆర్‌తోనూ భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన జరిగి రెండున్నరేళ్లు కావస్తోందని, రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఇంకా అలానే ఉండడం ఎవరికీ మంచిది కాదనే అభిప్రాయాన్ని ఈ సందర్భంగా కెసిఆర్ వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ ఇప్పటికే గవర్నర్‌తో రెండుసార్లు సమావేశం అయింది.
ఈనెల 26న మూడవ సారి సమావేశం కానుంది. కాగా ఈ భేటీలో సచివాలయంలో భవనాల అప్పగింతపై ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భవనాల అప్పగింతకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది.

చిత్రం..సచివాలయం, ప్రభుత్వ భవనాల అప్పగింతపై ఆదివారం ముఖ్యమంత్రి కెసిఆర్‌తో చర్చిస్తున్న గవర్నర్ నరసింహన్