రాష్ట్రీయం

అమరావతికి ఐటీ కంపెనీల రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: ఎపి రాజధాని అమరావతికి ఐటి కంపెనీలు తరలి వస్తున్నాయి. ఈ నెల 16 న ఏడు సంస్థలు విజయవాడలోని ఆటోనగర్‌లో తమ కార్యాలయాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. వీటి ద్వారా తొలుత 500 మంది యువతకు ఉపాధి లభించబోతోంది. ఈ నెల 16 న ప్రారంభం కాబోతున్న సంస్థల్లో యాక్సెల్ ఐటి, హారిజాన్ ఐటి, అడ్వాన్ సాఫ్ట్ (చికాగో), ఎంఎస్‌ఆర్ కాస్మోస్, అడెప్ట్ సొల్యూషన్స్, ఇంటెల్లిసాఫ్ట్, టైమ్‌స్క్వేర్ ఐటి ఉన్నాయి. ఈ సంస్థలు తొలుత 500 నుండి 600 మంది నిరుద్యోగ యువతను తమ సంస్థల్లో ఉద్యోగులుగా చేర్చుకునేందుకు కసరత్తు పూర్తి చేశాయి. మరో 15 సంస్థలు ఇంజనీరింగ్, టెక్ అభ్యర్థులకు స్కిల్ డెవలప్‌మెంట్ కోసం శిక్షణ ఇచ్చేందుకు ముందుకువచ్చాయి. ఈ సంస్థల్లో శిక్షణ తర్వాత సదరు అభ్యర్థులకు అత్యుత్తమ ఐటి కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అమరావతికి రాబోతున్న శిక్షణ సంస్థల్లో పది హైదరాబాద్ నుండి, ఐదు బెంగళూరు నుండి వస్తున్నాయి. ఎపి నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్
ఆఫీసర్ రవికుమార్ వేమూరు మాట్లాడుతూ, దాదాపు మూడు వేలమంది ఇంజనీరింగ్ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వబోతున్నట్టు చెప్పారు. విజయవాడ సమీపంలోని ‘మేథా టవర్స్’ను ఇప్పటివరకు ఏ ఐటి సంస్థ కూడా వినియోగించుకోలేదు. ఇప్పుడు స్పానిష్‌కు చెందిన ఐటి సంస్థ యాంటోలిన్ తమ కార్యాలయాన్ని మేథా టవర్స్‌లో ప్రారంభించబోతోంది. ఆటోమోటివ్, ఇంటీరియర్ డిజైన్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలో ఇది ప్రత్యేక సంస్థగా పేరు తెచ్చుకుంది. మరో విదేశీ సంస్థ నెస్లోవా సిస్టమ్స్‌తోపాటు మన దేశానికే చెందిన హెచ్‌సిఎల్ కూడా మేథా టవర్స్‌లో తమ కార్యాలయాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సంస్థలు దాదాపు 1000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. ఇప్పటికే హెచ్‌సిఎల్ సంస్థ ఉద్యోగుల నియామకం కోసం వివిధ ఇంజనీరింగ్ కాలేజీలను సంప్రదించింది.