రాష్ట్రీయం

అన్యాయం ఇంకెన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: కృష్ణా జలాల వాటాలో తరతరాలుగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కేంద్ర నిపుణుల కమిటీ ముందు తెలంగాణ వాదించింది. సోమవారం రాష్ట్రానికి వచ్చిన బజాజ్ కమిటీకి తెలంగాణకు జరిగిన, జరుగుతోన్న అన్యాయాన్ని గణాంకాలతో వివరించింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్వహణ, విధివిధానాలు, గోదావరి నుంచి పోలవరం, పట్టిసీమ ద్వారా మళ్లిస్తున్న కృష్ణా జలాల అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర జల సంఘం మాజీ అధ్యక్షుడు ఎకె బజాజ్ నాయకత్వంలోని నిపుణుల బృందం ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనుంది. ఇదిలావుంటే, గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా కృష్ణాకు ఆంధ్ర సర్కారు ఏవిధంగా మళ్లిస్తుందో సాక్ష్యాధారాలతో సహా తెలంగాణ అధికారులు నివేదించారు. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన పథకాలను ఎలా తుంగలో తొక్కారో కమిటీకి వివరించారు. 1956 నుంచి 2014 వరకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, తెలంగాణ ఆవిర్భావం తరువాత కూడా అది కొనసాగుతోందని వివరించారు. ఉమ్మడిలో చేపట్టిన సాగునీటి పథకాలు యథాతథంగా అమలు చేయాలని ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నా, ఇష్టానుసారం ప్రాజెక్టుల రూపకల్పన జరిగిందన్నారు. రెండు రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని కృష్ణా బోర్డుకు సరైన విధివిధానాలు రూపొందించాలని తెలంగాణ వాదించారు. హైదరాబాద్ ప్రభుత్వం కృష్ణా బేసిన్‌లో గతంలో రూపొందించిన అప్పర్ కృష్ణా, బీమా, తుంగభద్ర ప్రాజెక్టుల ద్వారా 174 టిఎంసిల నీటిని తెలంగాణ కోల్పోయిందని వివరించారు. బజావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునళ్ల ముందు తెలంగాణ ప్రజా ప్రయోజనాల కోసం ఉమ్మడి రాష్ట్ర సర్కారు సమర్ధవంతంగా వాదించలేదని తెలంగాణ ఆరోపించింది.
అంతర్జాతీయంగా సాగునీటి కేటాయింపులు, పంపిణీకి సంబంధించి అమలులోవున్న సహజ న్యాయ సూత్రాలను ఏపీ ఉల్లంఘించినట్టు ఆరోపించారు. క్యాచ్‌మెంట్ ఏరియా, సాగు యోగ్య భూములు, పేదరికం, వెనుకబాటుతనం, జనాభా తదితర అంశాల్లో ఏ ప్రాతిపదికన, ఏ ప్రమాణాల ప్రకారం చూసినా ఏపీకి కేటాయించిన 811 టిఎంసిలలో 450 టిఎంసిలు తెలంగాణకు రావాల్సిఉందని తెలంగాణ ప్రభుత్వం వివరించింది.
ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించినా అన్యాయం కొనసాగుతోందని, రాష్ట్రం ఆవిర్భవించి మూడేళ్లు కావస్తున్నా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేలలేదన్నారు. 299: 512 నిష్పత్తి ప్రకారం 2015లో రెండు రాష్ట్రాల మధ్య తాత్కాలికంగా అంగీకారం కుదిరిందని గుర్తు చేశారు. దీని ప్రకారం కృష్ణా ప్రాజెక్టుల అపరేషనల్ ప్రోటోకాల్‌ను రూపొందించాలని బజాజ్ కమిటీని తెలంగాణ కోరింది. పోలవరం, పట్టిసీమల ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లిస్తున్నందున, గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ఆధారంగా రెండు రాష్ట్రాల మధ్య ఆ జలాలను పంపిణీ చేయాలని తెలంగాణ కోరింది. పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా నదికి తరలిస్తున్న 80 టిఎంసిల గోదావరి జలాల్లో 45 టిఎంసిలను ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి కేటాయించిందని తెలంగాణ గుర్తు చేసింది. అయితే వీటిని నాగార్జునసాగర్ ఎగువనున్న ప్రాంతాల్లో రెండు రాష్ట్రాల్లోనూ సాగు యోగ్యభూమి ఎంత ఉన్నదో లెక్కగట్టి నీటిని పంపిణీ చేయాలని తెలంగాణ కోరింది. ఈ ఏడాది పట్టిసీమ ప్రాజెక్టు నుంచి 53 టిఎంసిల గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించినట్టు ఏపీ నిర్థారించినందున, దీనిలో తెలంగాణ వాటా ఖరారు చేయాలని బజాజ్ కమిటీని తెలంగాణ కోరింది. పట్టిసీమలోనూ న్యాయబద్ధమైన నీటి పంపిణీ జరగాలని కోరింది. ఉమ్మడి ప్రాజెక్టుల జాబితాలో కెఆర్‌ఎంబి జూరాలను చేర్చడం పట్ల తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపణ తెలిపింది. పులిచింతల , సుంకేశుల ప్రాజెక్టులను ఉమ్మడి జాబితాలో చేర్చాలని తెలంగాణ సూచించింది. బజాజ్ కమిటీ తమ సమస్యలను సానుభూతితో పరిశీలించాలని కోరినట్టు సమావేశం అనంతరం నీటిపారుదల రంగం సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు తెలిపారు. బజాజ్ కమిటీ ఎలాంటి సమాచారం కోరినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. బజాజ్ కమిటీ చైర్మన్ సిడబ్ల్యుసి మాజీ అధ్యక్షుడు ఎకె బజాజ్, సభ్యులు డికె మెహతా, ఆర్‌సి పాండే, ప్రదీప్ కుమార్, ఎన్‌ఎన్ రాయ్, కెఆర్‌బి చైర్మన్ ఎస్‌కె హల్దర్, సభ్య కార్యదర్శి డాక్టర్ సమీర్ ఛటర్జీ
తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్ సలహాదారు విద్యాసాగర్‌రావు, స్పెషల్ సిఎస్ జోషి, ఈఎన్‌సి మురళీధరరావు, సిఇలు ఖగేందర్‌రావు, సునీల్, ఓఎస్‌డి శ్రీ్ధర్‌రావు దేశ్‌పాండే, అంతర్ రాష్ట్ర నీటి వనరుల అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..జలాల పంపిణీపై తెలంగాణ వాదనలు వింటున్న కేంద్ర నీటిపారుదల నిపుణుల కమిటీ