రాష్ట్రీయం

అంతా ఒక్కటే.. అప్పుడే ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: దేశ ప్రజల మధ్య ఎలాంటి ప్రాంతీయ వైరుధ్యాలు లేకుండా అంతా ఒక్కటే అనుకునే భావన పెరిగిన నాడే భారత్ ప్రగతి సాధ్యపడుతుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆయన అమెరికాలోని హార్వర్డు విశ్వవిద్యాలయంలో విశ్వశక్తిగా ఎదుగుతున్న భారత్ అనే అంశంపై విద్యార్థులను ఉద్ధేశించి ప్రసంగించారు. గత నాలుగు రోజులుగా అమెరికాలో పర్యటిస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ కల్యాణ్ హార్వర్డు యూనివర్శిటీలో కీలకోపన్యాసం ఇచ్చారు. భారతదేశంలో అనేక మతాలు, సంస్కృతులున్నాయని, ప్రజలందరికీ దేశంపై ప్రేమ ఉందని, కానీ మనమంతా ఒక్కటే అనే భావన మరింత పెరగాలని పేర్కొన్నారు. దేశంలో ఉత్తరాది, దక్షిణాది అనే భావన ఇప్పటికీ ఉందని, దేశంలోనే నేతల్లో మార్పు రావాలని, చాలామందికి భారత భౌగోళిక నైసర్గిక స్వరూపం కూడా తెలియదని అన్నారు. భిన్న సంస్కృతుల ప్రజలు ఒకరినొకరు సంపూర్ణంగా అర్ధం చేసుకోవాలని, అంతా ఒక్కటే అనే భావన పరిఢవిల్లాలని , సాంస్కృతిక సమగ్రత పెరగాలని, దేశ ప్రజల్లో ఇలాంటి ఐక్య భావన ప్రోది చేస్తేనే భారత్ ప్రపంచశక్తిగా ఎదుగుతుందన్నారు. నాయకులు సమాజాన్ని విభజించి పాలించే ధోరణితో వ్యవహరిస్తుండటం వల్ల జరుగుతున్న నష్టాలను చూసి తట్టుకోలేక, వాటిని ప్రతిఘటించడానికే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నా వాటి ఫలాలు మాత్రం కొద్దిమందికే అందుతున్నాయని, దశాబ్దాలుగా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని చెప్పారు. భారత్‌లో ఉదాసీన సమాజం ఉందని, పక్కవారికి అన్యాయం జరిగితే ఎదిరించే మనస్తత్వం లేదని సామాజిక రుగ్మతలపై పోరటానికి ఎక్కువగా ఎవరూ ముందుకు రారన్నారు. ప్రస్తుత పాలకులు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారు కనుక దానిని అమలుచేయాల్సిందేనని పవన్ చెప్పారు.
అధికారంలో ఉండి జవాబుదారీతనం లేకుండా ఉంటే ఊరుకునేది లేదని, వారు అలా ఉన్నందునే తాము పోరాడుతున్నామని అన్నారు. రైతుల్లో ఆశావహ దృక్పథాన్ని పెంచాలని, స్వయంసహాయక సంఘాలు ఏర్పాటు చేయడం ద్వారా వారిలో పరస్పర సహకార భావాన్ని పెంచాలని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ చేరుకుంటున్న పవన్ కల్యాణ్ ఈ నెల 20న మంగళగిరిలో జరిగే చేనేత గర్జన సభకు పవన్ సన్నద్ధం కానున్నారని తెలిసింది.

చిత్రం..బోస్టన్‌లో ఆదివారం హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్