రాష్ట్రీయం

సైబర్ నేరాలకు ముకుతాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 14:ఏపీ సైబర్ సెక్యూరిటీ పాలసీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2017-18 సంవత్సరాన్ని ఈ-ప్రగతి సంవత్సరంగా వ్యవహరించేందుకు నిర్ణయించారు. 2,270 కోట్ల రూపాయల మేరకు కరవు సాయం అందించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాసేందుకు నిర్ణయించారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం మంగళవారం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వివరించారు. సైబర్ సెక్యూరిటీ ఆవశ్యకతను గుర్తించి సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మిషన్ లాంగ్వేజ్ తదితర కోర్సులను కళాశాల స్థాయిలో పాఠ్యాంశాలుగా చేర్చేందుకు వీలుగా మార్పులు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించడం, ప్రభుత్వానికి, వ్యాపార సంస్థలకు బలమైన సైబర్ రక్షణ వ్యవస్థ ఏర్పాటుచేయడం, సైబర్ నేరాలను ముందుగా గుర్తించి శిక్షించే విధంగా రూపొందించడం ఈ విధానంలో భాగమని తెలిపారు. ఆన్‌లైన్ సర్వీసులకు కూడా రక్షణ కల్పించేందుకు ఈ-ప్రగతి, సెక్యూరిటీ, ఎమెర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. రాష్ట్రాన్ని సైబర్ సెక్యూరిటీ హబ్‌గా తీర్చిదిద్దడానికి చర్యలు చేపడతారు. ఎస్‌టి విద్యార్థులు పరిశోధనలు చేసేందుకు వీలుగా సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ సబ్ ప్లాన్ కింద విజయవాడలో ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఆర్‌కె మఠానికి 50 సెంట్లు, విశాఖ జిల్లా భీమిలి మండలంలో ఇండియన్ నేవీకి 65 ఎకరాలు కేటాయించేందుకు నిర్ణయించారు. కొత్తవలస మండలం చిన్నారావుపల్లెలో పతంజలి ఆయుర్వేదిక్ సంస్థకు 172 ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు నిర్ణయించారు. వచ్చే వేసవిలో రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చూసేందుకు చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. పంచాయతీరాజ్, పురపాలక శాఖల పరిధిలో కంట్రోల్ రూం ఏర్పాటుచేయాలని నిర్ణయించామన్నారు. 2270 కోట్ల రూపాయల కరవు సాయాన్ని త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ ముఖ్యమంత్రి లేఖ రాసేందుకు కూడా మంత్రిమండలి ఆమోదించింది. వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి గ్రామస్థాయిలో ఈ ఫైల్ విధానాన్ని అన్ని శాఖల్లోను అమలుచేయాలని సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు. మాతృమూర్తులను గౌరవించాలన్న లక్ష్యంతో అమ్మకు వందనం కార్యక్రమాన్ని త్వరలో విద్యాలయాల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రైతులకు ఖర్చు తగ్గించి దిగుబడిని పెంచే ప్రకృతి వ్యవసాయాన్ని రానున్న ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల హెక్టార్లకు విస్తరించాలని మంత్రివర్గం లక్ష్యంగా నిర్దేశించుకుంది. భవన నిర్మాణ కార్మికులకు చంద్రన్న బీమా కింద అదనంగా మరో రూ.30వేలు చెల్లించేందుకు నిర్ణయించారు. అగ్రిగోల్డ్‌కు సంబంధించి కీసరలోని 350 ఎకరాలు, విజయవాడలో 8 వాణిజ్య సముదాయాలకు సంబంధించి రూ.16 కోట్ల ఆస్తుల అమ్మకానికి కోర్టు ఆమోదం తెలిపిన నేపథ్యంలో వాటి అమ్మకానికి చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు.

చిత్రం..మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు