రాష్ట్రీయం

బడ్జెట్ 1.4 లక్షల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: భారీ బడ్జెట్ ప్రవేశపెట్టేందుక ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈసారి 1.4 లక్షల కోట్లు ఉండొచ్చని అంచనా. గత ఏడాది 1.35 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఈసారి మరో ఐదు వేల కోట్లు పెంచే యోచనలో ఉంది. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోపాటు వివిధ వృత్తుల్లో ఉన్నవారికి తొడ్పడేలా బడ్జెట్‌లో సంక్షేమ పథకాలు ప్రకటించనున్నారు. నోట్ల రద్దు ప్రభావం రిజిస్ట్రేషన్ల శాఖపై వినా మిగిలిన శాఖల ఆదాయంలో ఏమాత్రం తగ్గుదల లేదని ప్రభుత్వం చెబుతోంది. గత ఏడాది 1.35లక్షల కోట్లమేర బడ్జెట్ ప్రవేశపెట్టినా, దాదాపు 1.02 లక్షల కోట్లమేర మాత్రమే నిధులు వెచ్చించగలిగారు. సాధారణంగా దేశంలో ఎక్కడా బడ్జెట్‌లో పేర్కొన్నంత వెచ్చించడం సాధ్యంకాదని, కనీసం 10 శాతం తక్కువ ఖర్చవుతుందని అధికారులు అంటున్నారు. ఉదాహరణకు వాణిజ్య పన్నుల శాఖలో నాలుగున్నర వేల కోట్ల వరకు బకాయిల పేచీలు ఉన్నాయి. ఇవి వస్తాయని బడ్జెట్‌లో చూపాల్సి ఉంటుంది. చూపక పోతే రద్దు చేశారా? అని కాగ్ తప్పు పడుతుంది. బడ్జెట్‌లో చూపించినా అవి రావు. ఇలాంటివన్నీ కలిపి కనీసం 10 శాతం తక్కువ బడ్జెట్ వ్యయం చేసే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. మార్చి 31న బడ్జెట్ ఆమోదించాల్సి ఉంటుంది. పదహారు రోజులపాటు సభ జరగాలి. ఈ లెక్కన మార్చి మొదటివారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోతుందని తొలుత ప్రభుత్వం భయపడింది. అయితే రిజిస్ట్రేషన్ల శాఖలో ఆదాయం 30 శాతం వరకు పడిపోయింది. మిగిలిన శాఖల ఆదాయంలో పెద్దగా తరుగుదల లేదని అధికారులు అంటున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో నోట్ల రద్దుకు ముందు ప్రతి రోజు పదహారు కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడది రోజుకు పది నుంచి 11 కోట్ల వరకు మాత్రమే ఉందని తెలుస్తోంది. సోమవారం రిజిస్ట్రేషన్ల ఆదాయం 11 కోట్లయితే, మంగళవారం పది కోట్లే ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత కేంద్రం నల్లధనంపై మరింత దృష్టి సారిస్తుందని, దీనివల్ల క్రమంగా ఆదాయం పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం ఆదాయం పెరిగినప్పుడు అదేస్థాయిలో రాష్ట్రాలకు కేటాయింపులు పెరుగుతాయి. దీనివల్ల సంక్షేమ పథకాలకు గణనీయంగా వ్యయం చేసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్‌కు రూపకల్పన చేస్తున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, పనులు వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించడం వల్ల రెండు మూడు నెలల పాటు అడ్డుకోగలరేమో కానీ ప్రాజెక్టులకు వచ్చిన ఇబ్బందులేమీ లేవని ముఖ్యమంత్రి అధికారులకు తెలిపారు. రాష్ట్రంలో ఆదాయంలో 21 శాతం వృద్ధి నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు.