రాష్ట్రీయం

ఇస్రో ప్రయోగం యువతకు స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 14: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో నేడు చేపట్టనున్న పిఎస్‌ఎల్‌వి సి-37రాకెట్ ప్రయోగం నేటి యువతకు స్ఫూర్తి కావాలని, భారత శాస్తవ్రేత్తలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ మంగళవారం ఖమ్మంలో మేక్ ఇన్ ఇండియా ఆధ్వర్యంలో 2కెఎం స్ఫూర్తి పాదయాత్ర నిర్వహించారు. దీనిలో భాగంగా పిఎస్‌ఎల్‌వి సి-37 రాకెట్ నమూనాతో పాటు 104 శాటిలైట్స్ నమూనాలు, 104 మీటర్ల పొడవైన భారత జాతీయ పతాకంతో విద్యార్థులు స్థానిక పెవిలియన్ గౌండ్స్ నుండి సర్దార్ పటేల్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ దేశాలన్నింటికీ మేక్ ఇన్ ఇండియా గొప్పతనాన్ని, శక్తిని ప్రపంచానికి చాటడమే కాకుండా ప్రతి భారతీయుడు గర్వంగా తలెత్తుకునే విధంగా ఇస్రో చేస్తున్న ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

చిత్రం..ఖమ్మంలో 104 మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహిస్తున్న దృశ్యం