రాష్ట్రీయం

ఆస్తులను స్వాధీనం చేసుకోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో జగన్‌కు చెందిన భారతి సిమెంట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆస్తులను తాము స్వాధీనం చేసుకోలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వర్గాలు హైకోర్టుకు తెలిపాయి. ఈ కేసు విచారణ సందర్భంగా ఇడి తరఫు న్యాయవాది పిఎస్‌పి సురేష్‌కుమార్ హైకోర్టుకు తెలియజేస్తూ భారతి సిమెంట్స్‌కు చెందిన ఆస్తులను ఇడి స్వాధీనం చేసుకోలేదని, మనీ లాండరింగ్ నిరోధక చట్టాన్ని అనుసరించి సెక్షన్ 5 (2) ప్రకారం నోటీసు మాత్రమే ఇవ్వడం జరిగిందని కోర్టుకు తెలిపారు. భారతి సిమెంట్స్, ఇతర కంపెనీల తరఫున దాఖలైన పిటీషన్ల తరఫున వాదనలను న్యాయమూర్తి విన్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో ఇడి ఇచ్చిన నోటీసులు పూర్తిగా అన్యాయమని పిటీషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. భారతి సిమెంట్స్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ఇడి వర్గాలు తమ వివరణలో కోర్టుకు ఒక రకంగా చెబుతూ, కోర్టు బయట మరోరకంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. అనంతరం ఈ కేసులో వాదోపవాదనలను వచ్చే బుధవారానికి వాయిదా వేశారు.