రాష్ట్రీయం

జూన్ 11న ‘సెట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: యూనివర్శిటీల్లో, డిగ్రీ కాలేజీల్లో అధ్యాపక నియామకాలకు ప్రధాన అర్హతగా భావిస్తున్న తెలంగాణ రాష్టస్థ్రాయి అర్హత పరీక్ష (టిఎస్ సెట్) నోటిఫికేషన్‌ను ఉస్మానియా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామచంద్రం గురువారం విడుదల చేశారు. టిఎస్ సెట్‌ను జూన్ 11న నిర్వహిస్తారు. దరఖాస్తులను ఈ నెల 22 నుండి ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. జరిమానా లేకుండా మార్చి 20 వరకూ, 1500 రూపాయల జరిమానాతో మార్చి 30 వరకూ, 2వేల జరిమానాతో ఏప్రిల్ 6 వరకూ, 3వేల జరిమానాతో మే 1వ తేదీ వరకూ దరఖాస్తులు దాఖలు చేయొచ్చు. హాల్ టిక్కెట్లను మే 20వ తేదీ నుండి జారీ చేస్తారు. ఈసారి ఆదిలాబాద్‌ను కొత్త రీజనల్ కేంద్రంగా ఎంపిక చేశామని, దాంతోపాటు హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ రీజనల్ కేంద్రాలుగా నిర్ణయించామని రామచంద్రం చెప్పారు.
పరీక్ష విధానం
తొలి సెషన్‌లో రెండు పేపర్లు, రెండో సెషన్‌లో ఒక పేపర్ ఉంటుందని టిఎస్ -సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ పి యాదగిరి స్వామి చెప్పారు. తొలి పేపర్ 60 ప్రశ్నలుంటాయని, అందులో 50 ప్రశ్నలు రాయాల్సి ఉంటుందని, వంద మార్కులకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. రెండో పేపర్ 50 ప్రశ్నలు 100 మార్కులకు, మూడో పేపర్ 75 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటాయి.