రాష్ట్రీయం

ఎపి మరో సిలికాన్ వ్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 17: రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ మరో సిలికాన్ వ్యాలీగా తయారవుతుందనడంలో సందే హం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడ ఆటోనగర్‌లోని ఐటి సర్వీస్ టెక్‌పార్క్‌లో శుక్రవారం 8 ఐటి కంపెనీలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఇప్పటికే విశాఖపట్నంలో 9 ఐటి కంపెనీలు వచ్చాయని, విజయవాడలో 20 ఐటి కంపెనీలు వచ్చాయని, రాబోయే కాలంలో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనీ అన్నారు. ఈ సర్వీస్ సెంటర్‌లో శిక్షణతోపాటు ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ఎపిఎన్‌ఆర్‌టి ద్వారా ఐటి సర్వ్ అలెయన్స్ కింద రాణించే వారిని ఇక్కడికి తీసుకువచ్చి కంపెనీలు ప్రారంభిస్తున్నందుకు అభినందించారు. ఈ ప్రాంతంలో చదువుకున్న వారు ప్రపంచం నలుమూలల ఉన్న ఐటి కంపెనీలలో పని చేస్తున్నారని, వారిని తిరిగి తాము పుట్టిన ప్రాంతంలో కంపెనీలు ప్రారంభించడానికి ఆహ్వానిస్తున్నామన్నారు.
ప్రపంచ రాజధానీ నగరాల్లో అమరావతి ప్రముఖ స్థానం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో ఆధార్ నెంబర్‌ను పౌరులకు ఇవ్వడం ద్వారా ఒక గుర్తింపు వచ్చిందన్నారు. దీనిద్వారా ఒక సెకన్‌లోనే వేలిముద్రల ద్వారా ఒక మనిషి వివరాలు తెలుసుకోవచ్చని, దీనిని మనం అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల కోసం ఉపయోగించుకుంటున్నామన్నారు. దీనిని 8 వేల కోట్లు ఖర్చుచేసి అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా సంక్షేమ పథకాలు అపలేదన్నారు. రేషన్‌లో ఆధార్ నెంబర్ ఉపయోగించడం వల్ల 11 శాతం, 20 శాతం స్కాలర్‌షిప్స్ ద్వారా ఆదా అయ్యిందని, మొత్తంగా ఆధార్ నెంబర్ ఉపయోగించడం వల్ల 10 శాతం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఆదా అయ్యిందన్నారు.
రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గృహాలకు 15 ఎంబిపిఎస్ స్పీడ్‌తో పైబర్‌గ్రిడ్ ద్వారా కనెక్షన్స్ ఇస్తామని తెలిపారు. ఇప్పటికే 10 లక్షల సెట్‌టాప్ బాక్స్‌లు తెప్పించామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే కాలంలో అన్ని అన్‌లైన్ సర్వీసులకే వెళుతున్నామన్నారు. హైదరాబాద్‌లో ఉన్న హైటెక్ సిటీ కంటే మెరుగైన టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్‌కు తెస్తామని, జూన్‌లో విజయవాడలో ఎన్‌టిఆర్ కాంప్లెక్స్‌లో హార్డ్‌వేర్ టెక్నాలజీని రూ.200 కోట్లతో 106 షాపుల ద్వారా ఏర్పాటు చేస్తామన్నారు. హార్ట్‌వేర్ సామగ్రి కోసం ప్రపంచ నలుమూలల నుంచి విజయవాడకు వచ్చేలాగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఒక బెస్ట్ ఎకోపార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. గతంలో హైదరాబాద్‌ను నాలెడ్జ్ హాబ్‌గా చేయడానికి అధిక ప్రాముఖ్యం ఇచ్చానని, భవిష్యత్తులో అమరావతిలో ఐటిని భారీఎత్తున ప్రమోట్ చేయనున్నట్లు చెప్పారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను కలసి ల్యాప్‌టాప్ ద్వారా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడంలో ఆయన ముగ్ధుడయ్యారని, అనాడే హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ కేంద్రం పెట్టాలని కోరానని, దాని ఫలితంగానే హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ సెంటర్ ఏర్పాటయ్యిందన్నారు.

చిత్రం..విజయవాడలో శక్రవారం ఐటి కంపెనీలను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు