రాష్ట్రీయం

అన్ని ప్రవేశపరీక్షలూ ఆన్‌లైన్‌లోనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: వృత్తి సాంకేతిక విద్య యుజి, పిజి కోర్సుల్లో చేరేందుకు దేశంలో మొట్టమొదటిసారిగా అన్ని ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే టోఫెల్, జిఆర్‌ఇ, జి మ్యాట్, క్యాట్ వంటి అంతర్జాతీయ, జాతీయ పరీక్షలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నా, అన్ని అడ్మిషన్లకూ ఆన్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహించడం ఇదే ప్రథమం అవుతుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి భారీ సన్నాహాలే చేస్తోంది. గత ఏడాది కాలంగా అనేకమార్లు సాంకేతిక నిపుణులతో విస్తృత చర్చలు జరిపిన ఉన్నత విద్యా మండలి ఎపి ఆన్‌లైన్, టిసిఎస్‌లతో కలిసి ఇందుకు భారీ ఏర్పాట్లు చేసింది. తొలిసారి ఆన్‌లైన్ పరీక్ష కావడంతో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అన్ని చర్యలనూ తీసుకుంది. పరీక్ష ఎలా రాయాలో కరపత్రాలు, ప్రకటనలతో పాటు వీడియోలను కూడా రూపొందించింది. అభ్యర్థులకు రెండు నెలల ముందుగానే మాక్ టెస్టులకు అవకాశం కల్పించింది. దీంతో పాటు తరచూ అడిగే ప్రశ్నలు, వాటి సమాధానాలు, అభ్యర్థులకు అవగాహన సిడిలు, కంప్యూటర్ ఆధారిత పరీక్ష కోసం స్టెప్ బై స్టెప్ గైడ్, యూజర్ మాన్యువల్స్‌ను తయారుచేసింది. ఎమ్సెట్‌తో పాటుగా, ఇసెట్, ఐసెట్,పిజిఇసెట్, ఎడ్‌సెట్,లాసెట్, పిఇసెట్‌లను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.
ఎపి ఎమ్సెట్‌ను ఏప్రిల్ 24నుండి 28 వరకూ ఐదు రోజుల పాటు పది స్లాట్‌లలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. తొలి నాలుగు రోజులు ఇంజనీరింగ్ స్ట్రీం విద్యార్థులకు, ఏప్రిల్ 28న అగ్రికల్చర్ స్ట్రీం విద్యార్థులకు పరీక్ష జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని సెంట్రల్ కమాండ్ ద్వారా పర్యవేక్షిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ విజయరాజు, ఉపాధ్యక్షుడు పి నర్సింహారావు, స్పెషల్ ఆఫీసర్ ప్రొఫెసర్ రఘునాథ్ తెలిపారు. ఐదు రోజుల పరీక్ష అనంతరం తొలి కీ విడుదల చేస్తామని, దానిపై అభ్యంతరాలను స్వీకరించి తుది కీ ఖరారు చేస్తామని, తుది కీ ఖరారైన వెంటనే అభ్యర్థులకు ఒక మెయిల్ నేరుగా పంపిస్తామని, మార్కులను తొలుత కేటాయించి, తర్వాత ర్యాంకులను ఇస్తామని చెప్పారు. ఆన్‌లైన్ పరీక్ష వల్ల అభ్యర్థులకు సమయం కలిసొస్తుందని, ఎన్నిసార్లయినా సమాధానాలు మార్చుకునే వీలుంటుందని పేర్కొన్నారు. మారుమూల గ్రామీణ విద్యార్థులకు సైతం అవగాహనకు సీడీలు ఇస్తామని, ఏమైనా అనుమానాలుంటే వాటికి సమాధానాలు ఇచ్చే వ్యవస్థను కూడా సిద్ధం చేశామన్నారు.