రాష్ట్రీయం

పెళ్లి పేరుతో వంచించిన హీరో అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్/హైదరాబాద్, ఫిబ్రవరి 17: పెళ్లిచేసుకుంటానని నమ్మించి ఓ మహిళను వంచించిన కేసులో సినీ హీరో నగేష్ యాదవ్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కర్ణాటక యాద్గిరి జిల్లా వాజీఖానాపేటకు చెందిన నగేష్ ‘పక్కాప్లాన్’ అనే సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు. సినిమా చిత్రీకరణ సమయంలో తనతోపాటు నటించిన నాగరాణితో పరిచయం ఏర్పడంది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తనకు ఆరేళ్ల కుమార్తె ఉందని చెప్పినా వివాహానికి తనకెలాంటి అభ్యంతరం లేదని ఆమెతో చెప్పాడు. నగేష్ మాటలు నమ్మిన నాగరాణితో చాలాకాలం సహజీవనం సైతం కొనసాగించాడు. కొన్నిరోజులుగా నగేష్ ముఖం చాటేయడంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నగేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.