రాష్ట్రీయం

పోస్ట్ఫాసుల్లో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: పాస్‌పోర్టుల జారీ ప్రక్రియలో హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఉత్తమ కార్యాలయంగా పేరుతెచ్చుకుందని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి డాక్టర్ ఇ.విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పాస్‌పోర్టుల జారీ ప్రక్రియకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా మన దేశానికి మూడో స్థానం వచ్చినట్లు ఆయన వివరించారు.
నగరంలోని బేగంపేటలో శనివారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే అన్ని పోస్ట్ఫాసుల్లో పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన అనుసంధాన ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఈ ప్రక్రియ మార్చి కల్లా ముగిసి, ఆ తర్వాత తెలంగాణలోని మహబూబ్‌నగర్, వరంగల్, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, కడప జిల్లాల్లోని పోస్ట్ఫాసుల్లో ఈ పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోస్ట్ఫాసుల్లో పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి దరఖాస్తుదారుల కష్టాలను తగ్గించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ ఓ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుని పోస్ట్ఫాసుల్లో ఈ సేవలను అనుసంధానం చేస్తున్నాయని ఆయన వివరించారు. 2016, 2015 సంవత్సరాల్లో దేశంలో అత్యధికంగా పాస్‌పోర్టులు జారీ చేయటంలో హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం రెండో స్థానాన్ని దక్కించుకుందని తెలిపారు. పోలీసు ధ్రువీకరణకు సగటున హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం తీసుకుంటున్న గడువు అయిదు రోజులని, దేశంలోనే అత్యంత వేగంగా తాము పాస్‌పోర్టులను జారీ చేస్తున్నామని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.