రాష్ట్రీయం

బజాజ్ కమిటీ వైఖరేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి జలాల పంపకంపై అధ్యయనం చేసేందుకు వచ్చిన ఎకె బజాజ్ కమిటీ తీరు తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉందంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు రాష్ట్ర సాగు నీటిపారుదల శాఖ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు ఆధ్వర్యంలో నిపుణులు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు లిఖిత పూర్వకంగా వినతిపత్రం అందించారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శి అమృత్ సింగ్‌ను కలిసి బజాజ్ కమిటీ విషయంలో తెలంగాణ రాష్ట్ర వైఖరి వివరించామని, పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్టు ఆర్ విద్యాసాగర్‌రావు ఆంధ్రభూమికి తెలిపారు.
గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్న ఆంధ్రప్రదేశ్ తీరును ఎకె బజాజ్ కమిటీకి వివరించామని, కాని తమ పరిధిలోకి రాదన్నట్టుగా మాట్లాడారన్నారు. ‘నీటి కేటాయింపులను ట్రిబ్యునల్ కేటాయిస్తుంది. కేంద్రం ఆదేశిస్తే మేము పరిశీలిస్తాం. మేము కేంద్రం నియమించిన కమిటీమాత్రమేనని ఎకె బజాజ్ తెలంగాణ రాష్ట్ర సాగునీటి నిపుణులకు తెలియచేసిన విషయం తెలిసిందే. బజాజ్ కమిటీ విధి విధానాలపై టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లోనే లోపాలున్నట్టు కనపడుతోందని, దీనిపై కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ స్పష్టత ఇవ్వాల్సి ఉందని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు ఏపీ మళ్లించి వినియోగించుకుంటుంటే, ఆమేరకు తెలంగాణ కృష్ణా జలాల్లో దక్కాల్సిన అదనపు జలాలు 45 టిఎంసిపై కేంద్రం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.
అదనంగా 45 టిఎంసి జలాలను ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మేరకు ఏర్పాటైన కృష్ణా బోర్డు కేటాయిస్తుందా? లేదా ప్రస్తుతం జలవనరుల శాఖ నియమించిన బజాజ్ కమిటీ అధ్యయనం చేసి సిఫార్సు చేస్తుందా? అని కేంద్రాన్ని తెలంగాణ కోరింది. గోదావరి జలాల మళ్లింపును పట్టించుకోని బజాజ్ కమిటీ, తెలంగాణ రాష్ట్రం చిన్నతరహా సాగునీటి వనరుల వినియోగంపై లెక్కలు అడిగిందని, ఇది బజాజ్ కమిటీకి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో లేదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ ఏడాది దాదాపు 53 టిఎంసి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు ఆంద్ర మళ్లించింది. గోదావరి జలాల ఒప్పందం ప్రకారం మళ్లించిన నీటిలో 65 శాతం వరకు అంటే 35 టిఎంసి నీరు ఎగువునున్న తెలంగాణకు నాగార్జునసాగర్ నుంచి అదనంగా డ్రా చేసే హక్కు తమకుందని కేంద్రానికి తెలంగాణ స్పష్టం చేసింది.
బజాజ్ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే పరిశీలించి ఏపి, తెలంగాణ ప్రభుత్వాల అభ్యంతరాలను అడిగి తెలుసుకుంటామని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఇక్కడి నుంచి వెళ్లిన సాగునీటి నిపుణుల బృందానికి తెలిపింది.