తెలంగాణ

హామీలు నెరవేర్చకపోతే తిరుగుబాటు తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 18: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు తిరుగుబాటు చేయక తప్పదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ అన్నారు. సిపిఎం మహాజన పాదయాత్రలో భాగంగా ఖమ్మంలో శనివారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్లానింగ్ కమిషన్‌ను రద్దుచేసి నరేంద్ర మోదీ ప్రజలకు అన్యాయం చేశారని, అదే తరహా మొండి వైఖరిని కెసిఆర్ కూడా అవలంబిస్తున్నారని విమర్శించారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాజన పాదయాత్రలో ప్రజల నుంచి తమకు అందే సమస్యలపై మహా ఆందోళనలు చేపడతామని చెప్పారు. పెద్దనోట్ల రద్దుతో కార్పొరేట్లకు లాభం చేకూర్చటంలో ప్రధాని మోదీ సఫలమయ్యారని, ఆయనకు మద్దతు పలికిన చంద్రబాబు, కెసిఆర్ కూడా ఎంత లబ్ధిపొందారో ఊహించుకోవచ్చని కారత్ ఆరోపించారు. పేదలు ఇబ్బందులు పడుతున్నా కొద్దిరోజులేనం టూ దాటవేసే ధోరణిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాయన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ళకు ఇచ్చే డబ్బులను లబ్ధిదారుల పేరుతోనే బ్యాంకుల్లో జమచేయాలని, దేవుడికి మొక్కులు కాకుండా ప్రజల మొక్కులు తీర్చాలని, లేనిపక్షం లో కెసిఆర్‌కు గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. జనాభా దామాషా ప్రకారం బడ్జెట్‌లో వాటాలు రావాలని, సామాజిక ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలకు సబ్‌ప్లాన్ అమలు చేయాలని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయి లో ప్రజల వద్దకు చేరేలా చూడాలని కారత్ డిమాండ్ చేశా రు. సభకు ముందు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి పాదయాత్రలో ప్రకాష్ కారత్ పాల్గొన్నారు.

క్షుద్ర పూజల పేరుతో
బాలికపై అత్యాచారం
ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 18: క్షుద్ర పూజల కోసమంటూ ఒక బాలికను తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసిన ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం నెమ్మాని గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలితో పాటు తండ్రి సైదులు జరిగిన దారుణంపై శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిఐ సుబ్బరాంరెడ్డి, ఎస్‌ఐ గోవర్ధన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నార్కట్‌పల్లి మండలంలోని బాజకుంట గ్రామానికి చెందిన బాలికను ఇదే మండలంలోని నెమ్మానికి చెందిన ఉయ్యాల వెంకన్న, నిజామాబాద్‌కు చెందిన క్షుద్ర పూజల నిర్వాహకులు మట్ట వినోద్, హైదరాబాద్‌కు చెందిన వినోద్, రాజు మాయమాటలతో నమ్మించి వెంట తీసుకెళ్లారు. నెమ్మాని సమీపంలోని తిరుమలగిరిలోని ఏ.ఇందిరమ్మ అనే మహిళ ఇంట్లో బాలికతో గుప్త నిధుల కోసమంటూ క్షుద్ర పూజలు నిర్వహించారు. అనంతరం ఆమెను పూజ పేరుతో వివస్తన్రు చేసి గదిలో నిర్బంధించి బీరు తాగించి ఫిబ్రవరి 13 నుండి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం ఇంటికి చేరుకున్న సదరు బాలిక తండ్రికి జరిగిన ఘోరాన్ని వివరించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం నార్కట్‌పల్లి స్టేషన్‌లో బాధితురాలితో కలిసి తండ్రి సైదులు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. గతంలో జనవరి 29న కూడా ఈ బాలికతో వారు పూజలు జరిపినట్లు సిఐ, ఎస్‌ఐ తెలిపారు. బాజకుంటకు చెందిన కళమ్మ అనే మహిళ ఉయ్యాల వెంకన్నకు బాలికను పరిచయం చేసిందని అత్యాచారం చేసిన నిందితులకు ఆమె సహకరించిందని వారు తెలిపారు. నిందితులు ఉయ్యాల వెంకన్న, మట్ట వినోద్, రాజు, వినోద్, కళమ్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.