రాష్ట్రీయం

రాయితీ మూరెడు భారం బారెడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ఆన్‌లైన్ చెల్లింపులకు ప్రోత్సాహకాలు అందిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూ వచ్చినా వాస్తవానికి మాత్రం అదనపు వడ్డింపులు తప్పడం లేదు. నగదు రహిత వ్యవహారాలను ప్రోత్సహించడానికి రాయితీలు ఇస్తామని, వడ్డింపులు రద్దు చేస్తామని గతంలో ప్రకటించారు. అయితే ఆన్‌లైన్‌లో వ్యవహారాలకు ముప్పావలా రాయితీ ఇచ్చి 11 రూపాయల అదనపు భారం విధిస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఏది ఉపయోగించినా పెట్రోల్ ధరతోపాటు సేవా పన్ను కలిపి రూ. 11.50లు అదనంగా వసూలు చేస్తారు. ఉదాహరణకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుపై 200 రూపాయల పెట్రోల్ కొట్టించుకుంటే 211 రూపాయల 50 పైసలు వసూలు చేస్తారు. కార్డుపై కొనుగోలు చేసినందుకు వంద రూపాయలకు 75 పైసల రాయితీ చొప్పున 150 పైసలు మనకు జమ అవుతుంది. అంటే అదనపు భారం పది రూపాయలన్నమాట. ప్రభుత్వరంగం సంస్థల బిల్లులకు కార్డు ఉపయోగించినా అదనపు భారం తప్పట్లేదు. విద్యుత్ బిల్లు ఆరేడు వందల రూపాయలు అనుకుంటే, విద్యుత్ ఆఫీసులో క్యూలో నిలబడి బిల్లు కడితే అదనపు భారం ఏమీ ఉండదు. ఈసేవ సెంటర్‌కు వెళ్లి బిల్లు కట్టినా ఐదు, పది రూపాయలు మాత్రమే అదనంగా భరించాలి. అదే క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే ఒకటిన్నర శాతం, డెబిట్ కార్డు ఉపయోగిస్తే ఒక శాతం అదనంగా చెల్లించాలి. ఆన్‌లైన్ కనీస చెల్లింపులకు సైతం ఎనిమిది రూపాయల వరకు అదనపు భారం పడుతోంది. ప్రైవేటు సంస్థలు వసూలు చేసే అదనపుచార్జీలను రద్దు చేస్తామని పెద్దనోట్ల రద్దు సమయంలో ఆర్భాటంగా ప్రకటించినా, చివరకు ప్రభుత్వ సంస్థల చెల్లింపులకు సైతం ఇప్పటివరకు అదనపు చార్జీలను రద్దు చేయలేదు. ఇక తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా టి- వ్యాలెట్ గురించి ప్రకటన చేసింది. వారం రోజుల్లో టి- వ్యాలెట్‌ను ముఖ్యమంత్రి విడుదల చేస్తారని డిసెంబర్ 10న ప్రకటించారు. రెండు నెలలు గడిచిపోయినా టి-వ్యాలెట్ వెలుగుచూసిన పాపాన పోలేదు. కేంద్రం ‘్భమ్’ యాప్‌ను విడుదల చేసినందున తెలంగాణ ప్రభుత్వం టి- వ్యాలెట్‌ను అటకెక్కించింది. టి- వ్యాలెట్‌పై సర్వీసు ప్రొవైడర్‌లతో విస్తృతంగా చర్చలు కూడా జరిగాయి. తొలి విడతగా జిహెచ్‌ఎంసి, వాటర్ వర్క్స్ వంటి శాఖలతో టి- వ్యాలెట్ సేవలు ఉంటాయని, అనంతరం రేషన్ షాపులు, స్కాలర్‌షిప్‌లు, ఈ- సేవా చెల్లింపులకు విస్తరిస్తామని చెప్పారు. టి- వ్యాలెట్ స్మార్ట్ఫోన్, ఫీచర్ ఫోన్, కంప్యూటర్, కాల్ సెంటర్, నోఫోన్ (్ఫన్ లేకున్నా) వంటి అయిదు పద్ధతుల్లో పనిచేసే విధంగా రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. టి- వ్యాలెట్‌లో తెలుగు భాషను సైతం ఉపయోగిస్తామని, దీనివల్ల గ్రామీణ ప్రజలు సైతం సులభంగా ఉపయోగించవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడా ప్రాజెక్టును మూలనపడేశారు.