కృష్ణ

మెట్రో రైల్ ప్రాజెక్టులో .. విఎంసికి 140 కోట్ల నిధుల కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 19: ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్టుకు మరో అడుగు ముందుపడింది. మెట్రో నిధులలో విజయవాడ నగరపాలక సంస్థకు సుమారు 140 కోట్లను కేటాయించారు. ప్రత్యమ్నాయ రోడ్లు, విద్యుత్ స్థంభాలు, సెంట్రల్ లైటింగ్‌ల తొలగింపు, పునఃనిర్మాణానికి గాను మెట్రో రైల్ ప్రాజెక్టు అధికారులు మంజూరు చేస్తూ పంపిన లేఖపై కమిషనర్ వీరపాండియన్ శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రకటన చేసారు. మెట్రో రైల్ నిర్మాణం నేపథ్యంలో ఏలూరు, బందర్ రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు ఉత్పన్నం కాకుండా ప్రత్యమ్నాయ రోడ్లను అభివృద్ధి తోపాటు ప్రాజెక్టుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్థంభాల తొలగింపు తోపాటు వాటిని అవసరమైన చోట్ల మళ్లీ ఏర్పాటుచేసే చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. మెట్రో పనులు ప్రారంభం కాక ముందే ప్రత్యమ్నాయ రోడ్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి పర్చి నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రానీయమన్నారు. ప్రత్యమ్నాయ రోడ్ల అంచనాలు త్వరలోనే సిద్దమవుతున్నాయని, మెట్రో పనులు జరిగితే పనుల వలన ట్రాఫిక్‌కు, ట్రాఫిక్ వలన పనులకు ఎటువంటి అవరోధాలు ఉత్పన్నం కాకుండా ప్రత్యమ్నాయ రహదారులను సిద్దం చేస్తున్నామన్నారు. కారిడార్ -1 పరిధిలో ఆటోనగర్ చెక్‌పోస్టు నుంచి బెంజిసర్కిల్ వరకూ రోడ్డు మధ్యలో గల సెంట్రల్ లైటింగ్‌ను తొలగించి వాటిని రోడ్డు కిరువైపులా ఏర్పాటుచేసేందుకు గాను కోటి 96లక్షలు, బెంజిసర్కిల్ నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకూ వయా గవర్నర్‌పేట బస్‌డిపో - 2 వరకూ గల రోడ్డు మధ్యలో గల సెంట్రల్ డివైడర్ లైటింగ్ తొలగింపు, మళ్లీ వాటిని ఏర్పాటుచేసేందుకు గాను కోటి 49 లక్షలతో అంచనాలను రూపొందించారు. అలాగే కారిడార్ -2 పరిధిలో గల నిడమానూరు జంక్షన్ నుంచి రామవరప్పాడు రింగ్ వరకు డివైడర్ మధ్యలో గల సెంట్రల్ లైటింగ్ తొలగింపు, ఏర్పాటుకు కోటి 85లక్షలు, అలాగే రైల్వే స్టేషన్ నుంచి గుణదల పవర్ స్టేషన్ వరకు గల సెంట్రల్ లైటింగ్ తొలగింపు, ఏర్పాటుకు కోటి 67లక్షలను కేటాయించారు. ఈ అంచనాలకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి పరిపాలనా పరమైన అనుమతులు కూడా లభించాయన్నారు.

కాంపౌండ్, రికర్వ్ విభాగాల విజేతలు వీరే
విజయవాడ (స్పోర్ట్స్), ఫిబ్రవరి 19: హిందూ కళాశాల మైదానంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల ఆర్చరీ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఇండియన్, కాం పౌండ్, రికర్వ్‌రౌండ్ విభాగాల్లో గెలుపొందిన విజేతలకు ఆదివారం సా యంత్రం అతిథుల చేతుల మీదుగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అందజేశారు. కాంపౌండ్ పురుషుల టీమ్ ఛాంపియన్‌షిప్‌లో యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోగా మహిళల విభాగంలో పంజాబీ విశ్వవిద్యాలయం ఛాంపియన్‌గా నిలిచింది. సావిత్రా బాయి పూలే పూణే యూనివర్శిటీ, పంజాబీ యూనివర్శిటీలు పురుషుల కాంపౌండ్ టీమ్ ఛాంపియన్‌షిప్ విభాగంలో ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి. గురునానక్ దేవ్ యూనివర్శిటీ, కురుక్షేత్ర యూనివర్శిటీలు మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలను ద క్కించుకున్నాయి. కాంపౌండ్ మిక్సిడ్ టీమ్ విభాగంలో పంజాబి యూనివర్శిటీ ప్రథమ స్థానం సాధించగా అతిథ్యమిచ్చిన కృష్ణా యూనివర్శిటీ ద్వితీయ స్థానాన్ని కురుక్షేత్ర యూనివర్శిటీ తృతీయ స్థానాన్ని దక్కించుకున్నాయి. రికర్వ్ టీమ్ ఛాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో చాంపియన్‌షిప్‌ను కురుక్షేత్ర యూనివర్శిటీ, మహిళల ఛాంపియన్‌షిప్‌ను గురునానక్ దేవ్ యూనివర్శిటీలు కైవసం చేసుకున్నాయి. పురుషుల విభాగంలో పంజాబి యూనివర్శిటీ ద్వితీయ స్థానాన్ని, మహర్షి దయానంద్ యూనివర్శిటీ తృతీయ స్థానాన్ని సాధించగా మహిళల విభాగంలో యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ, సావిత్రా బాయ్ ఫూలే పూణే యూనివర్శిటీలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. రికర్వ్ మిక్సిడ్ టీమ్ విభాగంలో పంజాబి యూనివర్శిటీ ఛాంపియన్‌గా నిలవగా సావిత్రి బాయ్ ఫూలే పూణే యూనివర్శిటీ ద్వితీయ, రాంచీ యూనివర్శిటీ తృతీయ స్థానాల్లో నిలిచాయి.

న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 19: న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని ‘లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టీస్’ డిమాండు చేసింది. ఈమేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని దీనిలో భాగంగా త్వరలో పార్లమెంటు సభ్యులను కలిసి విఙ్ఞప్తి చేయడం జరుగుతుందని ఫోరం మేనేజింగ్ ట్రస్టీ అన్న సుబ్బారావు తెలిపారు. బందరురోడ్డులోని విజయకృష్ణా సూపర్ బజార్ అమరావతి హాలులో ఆదివారం ఫోరం ఆధ్వర్యాన సదస్సు జరిగింది. ఈ సదస్సు ముఖ్య అతిధిగా పాల్గొన్న సుప్రీం కోర్టు న్యాయవాది, ఫోరం మేనేజింగ్ ట్రస్టీ అన్నం సుబ్బారావుతోపాటు , సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది మరుపుత్తమ్ మాట్లాడుతూ పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవ్యవస్థలో, ఉద్యోగ కేటాయింపులో, ఎడ్యుకేషన్ రంగంలో బిసి-27శాతం, ఎస్సీ 15శాతం, ఎస్టీ 7.5శాతం ప్రతిపదికన వారికి కేటాయింబడిన రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా అమలు అయ్యేలా చూడాలని, కేంద్ర, రాష్ట్రాల ప్యానల్స్‌ల్లో స్టాండింగ్ కౌన్సిల్, పబ్లిప్రాసిక్యూటర్‌ల నియామకాల్లో బిసి, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్‌ను అమలు చేయాలని, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌లో, జాతీయ షెడ్యూళ్ళు కులములు మరియు షెడ్యూళ్ళు తెగల వారికి ఆర్టికల్ 338 ప్రకారం కల్పించిన రిజర్వేషన్‌ను వెనుకబడిన తరగతుల వారికి కూడా సమాన ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని, ఐఏఏస్, ఐపిఎస్ తరహాలో జాతీయ కేంద్ర న్యాయ నియామక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, వాటిలో బిసి, ఎస్సీ, ఎస్టీ లకు కూడా రిజర్వేషన్ ప్రాతిపదికన రాజ్యాంగబద్ధంగా అమలు జరిపే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కరియముండా కమిటీ, నాచి అప్పన్ కమిటీ నివేదికల ఆధారంగా ఉన్నత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకంలో రిజర్వేషన్‌ను అమలు చేయాలని, అన్ని జిల్లా కోర్టుల్లో, స్పెషల్ కోర్టుల్లో లా ఆఫీసర్ల నియామకంలో బిసి, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ అమలు చేయాలని, ఓబిసి క్రిమిలేయర్ వార్షిక ఆదాయం పరిమితిని 25లక్షలకు పెంచాలని డిమాండు చేశారు. ఈమేరకు ప్రవేశపెట్టిన తీర్మానాలను సదస్సు అమోదించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిసి లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లపుకృష్ణ, హైకోర్టు న్యాయవాది నాగోలు శ్రీనివాస్ యాదవ్, తేజేశ్వరరావు, గుడిపల్లి సుబ్బారావు, నర్సయ్య, ప్రకాష్, దూళ్ళ శ్రీనివాస్, వి గుర్నాధం, నర్రా నాగేశ్వరరావు, మట్టా జయకర్, కంచర్ల త్రినాధ్ తదితరులు పాల్గొనగా.. బెజవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పిళ్లారవి అధ్యక్షత వహించారు.