రాష్ట్రీయం

ఎస్‌ఐ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న సబ్-ఇన్స్‌పెక్టర్‌ను హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐపై 497, 448 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్టు ఇన్‌స్పెక్టర్ వహీదుద్దీన్ తెలిపారు. ఖమ్మం-2టౌన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న విజయ్‌కి ఓ మహిళ ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. మోదీనగర్ కామధేను అపార్ట్‌మెంట్‌లో వారిద్దరూ గత ఎనిమిది నెలలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా ఎస్‌ఆర్ నగర్ పోలీసులు విజయ్‌ని అరెస్టు చేశారు. ఎస్‌ఐ విజయ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఆ మహిళ భర్తే అక్కడి వాచ్‌మన్ ద్వారా పోలీసులకు సమాచారం అం దించినట్టు తెలిసింది. తొమ్మిదేళ్ల క్రితం వివాహమైన మహిళ, ఎనిమిది నెలలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్‌ఐపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.