రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాలలో కౌన్సిల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఫ్రిబవరి 21: ఆంధ్రప్రదేశ్‌లో ఏడు, తెలంగాణలో మూడు ఎమ్మెల్యే కోటాలో కౌన్సిల్ సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను మంగళవారం నాడు ప్రకటించింది.రెండు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యే కోటాలో శాసనమండలికి ఎన్నికైన 10 మంది సభ్యుల పదవీకాలం మార్చి 29 తేదీతో పూర్తికానుంది.ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఫ్రబవరి 28తేదీ నాడు జారీ అవుతోంది. ఈ స్ధానాలకు నామినేషన్ల మార్చి 7 కాగా,అలాగే మార్చి 8 నాడు నామినేషన్లను పరిశిలించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది, ఇక నామినేషన్లు మార్చి10లోగా ఉపసంహరించుకొవాల్సి ఉంటుంది. ఈ సీట్లకు మార్చి 17నాడు పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందని ఈసి ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అసెంబ్లి స్థానాల కోటాలో మార్చి 29తో ఏడు సీట్లు ఖళీ అవుతున్నాయి.మూఖ్యాంగా మండలి ప్రతిపక్షానేత రామచంద్రయ్య తో పాటు చెంగల రాయుడు,సుధాకర్ బాబు,వెంకట సతీష్ కుమార్ రెడ్డి,పి.జే.సీ శేఖర్‌రావు,కె.్భరతి,మహ్మద్ జానీ,తెలంగాణకు చెందిన సయ్యద్ అల్త్ఫా హైజర్ రజ్వి,ఎం రంగారెడ్డి,గంగాధర్ గౌడ్‌ల పదవీ కాలం మార్చి 29 తేదీతో పూర్తి కానుంది.