ఆంధ్రప్రదేశ్‌

నిరుద్యోగ భృతి ఏది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: టిడిపి అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు వెంటనే ప్రతి నెల భృతిని చెల్లిస్తామని ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బహిరంగ లేఖ రాశారు. వచ్చే బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి చెల్లింపునకు నిధులు కేటాయించాలని కోరారు. లేని పక్షంలో తమ పార్టీ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇంటికో ఉద్యోగం, ఉపాధి కల్పిస్తామని, అది దొరికేంతవరకు ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలంటూ ఊరూరా ఊదర గొట్టారన్నారు. ప్రధాని మోదీ, పవన్‌కల్యాణ్ టిడిపి వాగ్దానాలను బలపరిచినట్లుగా బాబు సంతకం చేసి ఇంటింటికి కరపత్రం ప్రతులను పంచారన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాటను గత రెండున్నరేళ్లకు పైగా వివిధ వేదికల ద్వారా పదేపదే గుర్తు చేస్తూనే ఉన్నామన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 33 నెలలు గడిచిపోయాయన్నారు. ఈ 33 నెలల కాలంలో ఒక్కో నిరుద్యోగికి ప్రభుత్వం ఇంటింటికి పడిన బకాయి రూ.66వేల మేరకు ఉంటుందన్నారు. ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కోటయ్య కమిటీని అడ్డుపెట్టుకుని రైతులకు అన్యాయం చేసినట్లుగా జన్మభూమి కమిటీలు అనే రాజ్యాంగేతర ముఠాల ద్వారా పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇతరర సంక్షేమ పథకాల్లో అన్యాయం చేసినట్లుగా, జన్మభూమి కమిటీలు అనే రాజ్యాంగేతర ముఠాల ద్వారా పెన్షన్లు రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాల్లో అన్యాయం చేసిన విధంగా కాకుండా సాట్యురేషన్ పద్ధతిలో ప్రతి ఇంటికి రూ.2వేల నిరుద్యోగ భృతిని చెల్లించాలన్నారు. రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా పారిశ్రామిక, ఐటి రంగాల్లోని ప్రభుత్వ రంగాల్లో కాని ఉద్యోగావకాశాలు లేవన్నారు. నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఏ సమాజానికి మంచిది కాదన్నారు.