తెలంగాణ

అత్తాపూర్‌లో ఘోరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ రాజేంద్రనగర్, ఫిబ్రవరి 22: రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ కూలర్ల గోదాంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. వీరిలో నలుగురు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. నగరశివారులోని అత్తాపూర్-ఉప్పర్‌పల్లిలో కార్వాన్ ప్రాంతానికి చెందిన ప్రమోద్‌కుమార్ ఏనోవాబ్రాండ్‌కు చెందిన ఓమ్ ఏవన్ ఎయిర్ కూలర్లను తయారుచేసే గోదాం నిర్వహిస్తున్నాడు. వేసవి సమీపిస్తుండటంతో కూలర్ల తయారీ వేగవంతమైంది. గోదాంలో రాత్రింబవళ్లుళ్లు కూలర్లను తయారుచేస్తున్నారు. మంగళవారం రాత్రి సైతం కూలర్లు తయారు చేయడానికి కార్మికులు పనికి వచ్చారు. ఈ క్రమంలో కార్మికులు బయటకు వెళ్లకుండా గోదాం యజమాని ప్రమోద్‌కుమార్ గోదాం మెయిన్ షట్టర్లకు బయటి నుంచి తాళాలు వేసి వెనుక వైపుఉన్న డోర్‌ను తెరచి ఉంచి వెళ్లిపోయాడు. కార్మికులు పనిచేస్తుండగా తెల్లవారుజామున ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ సంభవించింది. అదే సమయంలో కార్మికులు టీ పెట్టుకోవడానికి గ్యాస్‌ను వెలిగించారు. ఈ రెండు ప్రమాదాలు ఒకేసారి చోటుచేసుకోవడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. గోదాం మొత్తం మంటలు వ్యాపించగా కార్మికులు ఆందోళనకు గురై పరుగులు తీసేందుకు యత్నించారు. కానీ షట్టర్ బయట తాళం వేసి ఉండటం, వెనుక నుంచి వెళ్లడానికి దారి సరిగ్గా లేక ఆరుగురు కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గోదాంకు ముందున్న షట్టర్‌ను తెరిచేందుకు విఫలయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. ఈ సంఘటన తెల్లవారుజామున గం. 4.00ల ప్రాంతంలో చోటుచేసుకోవడంతో సకాలంలో ఎవరూ స్పందించలేకపోయారు. షట్టర్లు మూసి ఉండడంతో అందులో ఉన్న కార్మికుల ఆర్తనాదాలు ఎవరికీ వినపడకపోవడంతో ఆరుగురు కార్మికులు గోదాంలోనే సజీవదహనమయ్యారు. ప్రమాద సమయంలో కార్మికులు గోదాం యజమాని ప్రమోద్‌కుమార్‌కు పలుమార్లు ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు. కాగా గోదాంలో పెద్దఎత్తున మంటలు వ్యాపించి ఎగసిపడుతుండడంతో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులు గమనించి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి షట్టర్ తెరవడానికి ప్రయత్నించినా తాళాలు ఉండడంతో లారీ సహకారంతో షట్టర్‌ను కూల్చివేశారు. అప్పటికే మంటలు ఎగసి పడుతుండడంతో గోదాంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపి ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకురావడానికి సుమారు ఏడుగంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. లోపలికి వెళ్లి చూడగా ఆరుగురు సజీవ దహనమై కన్పించారు. అందులో ఒడిసా రాష్ట్రానికి చెందిన సద్దాం(19), ఇర్ఫాన్(20), సదన్(19), ముజాహిద్(20), మరో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. పూర్తిగా కాలిపోయిన వారి మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇంకా మిగతా ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉందని డిసిపి పద్మజ తెలిపారు.
సంఘటన స్థలాన్ని సందర్శించిన మంత్రులు
బుధవారం అత్తాపూర్‌లో తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవ దహనమైన విషయం తెలుసుకున్న రాష్ట్ర హోంశాఖమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాద ఘటనను తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు నష్టపరిహారం చెల్లించనున్నట్టు మంత్రి మహేందర్‌రెడ్డి ప్రకటించారు. తక్షణ సహాయం కింద రూ.50 వేలు, దహన సంస్కారాలకు రూ.25 వేలు తక్షణ సహాయంగా ఇవ్వాలని హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి వెల్లడించారు. ఎలాంటి అనుమతులు లేకుండా గోదాంలను నిర్మించి, పరిశ్రమను నిర్వహించి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడానికి కారకుడైన గోదాం నిర్వాహకుడిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలో ఇలాంటి గోదాంలు ఉంటే వెంటనే వాటిని సీజ్ చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేస్తామని ప్రకటించారు. కార్మిక కుటుంబాలకు మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
జిహెచ్‌ఎంసి నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇన్నర్ రింగు రోడ్డుపై కూలర్లు తయారుచేసే గోదాం నిర్వహిస్తూ ఆరుగురి ప్రాణాలు పోవడానికి కారణమైన నిర్వాహకుడు ప్రమోద్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన వారిలో జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కార్పొరేటర్లు తోకల శ్రీనివాస్‌రెడ్డి, రావుల విజయ, కోరణి శ్రీలత, డిసి దశరథ్, ఈ ఈ లచ్చిరామ్, శంషాబాద్ డిసిపి పద్మజ, ఫైర్ డిసిపి, ఏసిపి గంగారెడ్డి, సిఐలు తదితరులు ఉన్నారు.

చిత్రం... గోదాంలో ఎగసి పడుతున్న మంటలు. మృతదేహాలను గోదాం నుంచి బయటకు తరలిస్తున్న పోలీసులు