రాష్ట్రీయం

ఇక ప్యారిస్‌లో అరకు కాఫీ ఘుమఘుమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 24: ఎక్కడో తూర్పు కనుమల్లో మొలకెత్తిన కాఫీ విత్తనం.. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని, ఇప్పుడు ప్యారిస్‌కు చేరుకుంది. దేశీయ మార్కెట్‌లో విశేష స్థానాన్ని సంపాదించిన అరకు కాఫీ, ఇప్పుడు ప్యారిస్ మార్కెట్‌లో హల్‌చల్ చేయబోతోంది. అరకు కాఫీ తొలి ఔట్‌లెట్‌ను ప్యారిస్‌లో ప్రారంభిస్తున్నారు. వ్యాపార దిగ్గజాలైన ఆనంద్ మహేంద్ర, ఇన్ఫోసిస్ కో-్ఫండర్ క్రిస్ గోపాలకృష్ణ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ చైర్మన్ సతీష్‌రెడ్డి, సోమా ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ రాజేంద్రప్రసాద్ మాగంటి అరకు కాఫీని ప్యారిస్ ప్రజలకు పరిచయం చేస్తున్నారు. అరకు కాఫీ ఇప్పటికే స్విట్జర్లాండ్ మార్కెట్‌లో అమ్ముడవుతున్న సంగతి తెలిసిందే. విశాఖ ఏజెన్సీలోని అరకు, పాడేరు, జికె వీధి, చింతపల్లి మండలాల్లో కాఫీ తోటలు విస్తృతంగా ఉన్నాయి. ఏడేళ్ల కిందటి వరకూ కాఫీ సాగు నిర్లక్ష్యానికి గురైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నాందీ ఫౌండేషన్, డాక్టర్ రెడ్డీస్ సంస్థ వ్యవస్థాపకుడు అంజిరెడ్డి ఈ కాఫీని మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు ఆలోచన చేశారు. ఎటువంటి రసాయనాలు వాడకుండా, సేంద్రీయ పద్ధతులతో పండిస్తున్న అరకు కాఫీకి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలన్న వీరి ఆలోచన కార్యాచరణలోకి వచ్చింది. సుమారు నాలుగు సంవత్సరాల కిందట అరకు కాఫీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. అప్పటివరకూ మన మార్కెట్‌లో ఉన్న వివిధ రకాల కాఫీలను అనతికాలంలోనే అరకు కాఫీ వెనక్కు నెట్టింది. భారతదేశంలోని ప్రీమియం అరబిక్ క్లాసిక్ కాఫీని తలదనే్న విధంగా అరకు కాఫీ తయారైంది. బెంగళూరులో ఐసిటిఎలో ఇతర రకాల కాఫీలు నాలుగు నుంచి ఐదు మెట్రికల్ టన్నులు అమ్ముడవుతుండగా, అరకు కాఫీ 70 మెట్రిక్ టన్నులు అమ్ముడైందంటే ఈ కాఫీకి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.