రాష్ట్రీయం

విఆర్‌ఎల పంట పండింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: విలేజ్ రెవిన్యూ అసిస్టెంట్లుగా (విఆర్‌ఎ) వారసత్వంగా పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ సిఎం కె చంద్రశేఖర్‌రావు శివరాత్రి వరాలు ప్రకటించారు. ప్రస్తుతం విఆర్‌ఎలకు చెల్లిస్తున్న వేతనాన్ని 64.61 శాతం పెంచుతున్నట్టు ప్రకటించారు. దీంతో వారసత్వంగా విఆర్‌ఎ ఉద్యోగాలు చేస్తున్నవారి వేతనం 6500 నుంచి 10,500కు చేరుకోనుంది. వేతనం పెంపుతోపాటు విఆర్‌ఎ కుటుంబానికి అదనంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఇంక్రిమెంట్ 200 చెల్లించనున్నట్టు ప్రకటించారు. అలాగే వీరికి పని చేస్తున్న చోటనే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించనున్నట్టు వెల్లడించారు. దీంతో రాష్టవ్య్రాప్తంగా పని చేస్తున్న 19,345 విఆర్‌ఎలకు లబ్ధి కలుగుతుంది. వారసత్వంగా పని చేస్తున్న వారే కాకుండా పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా ఎంపికై తక్కువ వేతనంతో పని చేస్తున్న 2900 మంది కాంట్రాక్టు విఆర్‌ఎ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయనున్నట్టు సిఎం ప్రకటించారు. రెండు కేటగిరీలకు చెందిన విఆర్‌ఎల ప్రతినిధులతో రెండు దఫాలుగా మంత్రి కె తారక రామారావుతో చర్చలు జరిపిన ప్రతినిధుల బృందంతో శుక్రవారం ప్రగతి భవన్‌లో సిఎం సమావేశమయ్యారు. ‘తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్భ్రావృద్ధిలో విఆర్‌ఎల పాత్ర ఎనలేనిది. 24 గంటలూ గ్రామాల్లో అందుబాటులో ఉండి ప్రభుత్వం తరఫున ప్రతీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. విఆర్‌ఎలుగా పని చేస్తున్న వారంతా పేదలు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు చెందిన వారే. పేరుకు పార్ట్‌టైమ్ ఉద్యోగమే అయినా ఓవర్ టైమ్ పని చేస్తున్న వీరు రూ.6500 వేతనంతో బతకడం కష్టతరం. అందుకే వీరికి వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనా గ్రామస్థాయిలో అందుబాటులో ఉండి సేవలకు గుర్తింపుగా నెలకు రూ.10,500 వేతనం చెల్లించాలని నిర్ణయం తీసుకున్నాం’ అని సిఎం ప్రకటించారు. వీరికి పెంచబోయే వేతనం ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వస్తుందన్నారు. మిగతా ఉద్యోగుల మాదిరిగా వీరందరికీ ఒకటినే వేతనం అందాలన్నారు. వేతనంతో పాటు విఆర్‌ఎల ఆత్మగౌరవం పెంచడానికి ఇకనుంచి వెట్టి, మస్కూరి, కావల్ కార్, కాన్‌దార్ తదితరులను విలేజి రెవిన్యూ అసిస్టెంట్లుగా పేరు మార్చుతున్నామన్నారు. వారసత్వంగా విఆర్‌ఎలుగా పని చేస్తున్నవారు తమ సర్వీసు కాలమంతా గ్రామాలలోనే విధులు నిర్వహిస్తుండటంతో వీరి సేవలకు గుర్తింపుగా అదే గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ (విఆర్‌వో), డ్రైవర్, అటెండర్ వంటి రెగ్యులర్ పోస్టుల నియామకాల్లో విఆర్‌ఎలకు 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. విఆర్‌ఎలుగా పని చేస్తున్న మరోరకం వారున్నారు. వారు పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా ఎంపికయ్యారు. వీరు కూడా తక్కువ వేతనానికి పని చేస్తున్నారు. కొత్త డివిజన్లు, మండలాలు, జిల్లాలు ఏర్పడటంతో చాలా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం పని చేస్తున్న విఆర్‌ఎలు అందరినీ రెగ్యులరైజ్ చేయడానికి విధి విధానాలను రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు.

చిత్రం..ప్రగతి భవన్‌లో నిర్వహించిన సమావేశంలో వారసత్వ విఆర్‌ఎల జీతాలు పెంచుతున్నట్టు ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్