రాష్ట్రీయం

పాక్ అనుకూల ప్రటనలు చేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: దేశంలో కాంగ్రెస్ పరిస్థితి నీళ్లలోంచి ఒడ్డున పడ్డ చేపలా మారిందని, అధికారం కోసం కొట్టుమిట్టాడుతోందని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శనివారం నాడిక్కడ బిజెపి కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్ర మాజీ మంత్రి చిదంబరంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విధానాల వల్ల కాశ్మీర్ కోల్పోతున్నామంటూ చిదంబరం మాట్లాడారని, ఈ వ్యాఖ్యలు జాతి వ్యతిరేకమని, పూర్తిగా బాధ్యతా రాహిత్యమని పేర్కొన్నారు. కాశ్మీర్ పరిస్థితి అంతా తెలిసి ఇష్టారాజ్యంగా మాట్లాడారని, ఫరూక్ అబ్దుల్లా సైతం గతంలో పదవి కోల్పోయిన తర్వాత తన గొంతు మార్చారని, అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి కూడా అలానే ఉందని అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రవాద కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించామని పేర్కొన్నారు. ఆర్‌బిఐ గురించి కూడా చిదంబరం మాట్లాడిన తీరు సరికాదని వెంకయ్యనాయుడు అన్నారు. నోట్ల రద్దుపై కేంద్ర మాజీ మంత్రి అనుచితంగా మాట్లాడారని, కాని దేశ ప్రజలు నరేంద్రమోదీ నిర్ణయానికి మద్దతుగా నిలిచారని వివిధ రాష్ట్రాల్లో తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడించాయన్నారు. కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్‌కు అనుకూలంగా ప్రకటనలు చేస్తోందని, అధికారంలో ఉన్నంత కాలం ఏ అభివృద్ధి చేసిందో ఆ పార్టీ ఇప్పటికైనా చెప్పాలని ఆయన నిలదీశారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదం పెచ్చరిల్లినపుడు నియంత్రించలేకపోయిన నేతలు ఇపుడు వేదాలు వల్లిస్తున్నారని విమర్శించారు.