రాష్ట్రీయం

ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యకు ముందు జాబ్‌చార్ట్‌ను పరిశీలించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ఒక ప్రభుత్వ ఉద్యోగిపై సంబంధించిన ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకునే ముందు ఆ ఉద్యోగి జాబ్ చార్ట్ (విధులు)ను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. ప్రాంతీయ రవాణాశాఖాధికారి పి సుధాకర్ రెడ్డికి ఒక వార్షిక ఇంక్రిమెంట్‌ను నిలుపుదల చేస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యను తోసిపుచ్చుతూ జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ అనిస్‌తో కూడిన ధర్మాసనం పైతీర్పును వెలువరించింది. ఈ కేసులో ఆర్‌టివో సుధాకర్ రెడ్డి 2002-03లో మంచిర్యాల వద్ద ఒక చెక్‌పోస్టులో పనిచేసేవారు. ఈ చెక్‌పోస్టుపై ఏసిబి అధికారులు దాడులు నిర్వహించి అవకతవకలు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై 2005లో ఉన్నతాధికారులు ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చారు. శాఖాపరమైన విచారణలో అవకతవకలు నిరూపణ కాకపోయినా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న కారణంపై ఆర్‌టివోకు ఒక ఇంక్రిమెంట్ నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఆర్‌టివో మొత్తం చెక్ పోస్టులను పర్యవేక్షించాల్సి ఉంటుందని, అతని జాబ్ చార్ట్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ఉన్నతాధికారులు పెనాల్టీ విధించారని హైకోర్టు పేర్కొంది. తెల్లవారుజామును 3 గంటలకు ఆర్‌టివో చెక్‌పోస్టులో ఎలా ఉంటారనే దానిపై ఉన్నతాధికారులు సరైన వివరణ ఇవ్వలేకపోయారని హైకోర్టు పేర్కొంది.