రాష్ట్రీయం

తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు లభించేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరంతో పాటు అనేక సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు వచ్చే నెల 2, 3 తేదీల్లో కేంద్రం కీలక సమావేశాన్ని నిర్వహిం చనుం ది. అవసరమైన రికార్డులతో ఈ సమావేశానికి రావాల్సిందిగా రాష్ట్ర అటవీ, సాగునీటి ఇంజనీరింగ్ శాఖ అధికారులకు కేంద్రం సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం కుదరదని గతంలో కేంద్రం సూత్రప్రాయంగా స్పష్టం చేసిన విషయం విదితమే. ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, ప్రణాళికకు కేంద్ర జల సంఘం నుంచి అనుమతి తీసుకోవాలని కేంద్ర పర్యావరణ శాఖలోని ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ కోరింది. కాళేశ్వరం సాంకేతిక, ఆర్ధిక సాధ్యాసాధ్యాల నివేదికకు సిడబ్ల్యుసి అనుమతి తర్వాతనే పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు మార్గం సుగమం అవుతుందని సాగునీటి అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రం పర్యావరణ మంత్రిత్వశాఖ మార్చి, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న సమావేశం కీలకంగా మారనుంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రానికి తెలిపారు. కేంద్ర జల సంఘం ఆమోదం లభించిన తర్వాత మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చే విషయమై పరిశీలిస్తామని పర్యావరణ శాఖ లిఖితపూర్వకంగా రాష్ట్రానికి తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కెసిఆర్ సవాలుగా తీసుకుని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ గ్రామం వద్ద 180 టిఎంసి నీటిని నిల్వ చేసి ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 7.38 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌ను రూపొందించారు. ఈప్రాజెక్టు వల్ల మహారాష్టల్రో 302 హెక్టార్ల అటవీ భూమి ముంపునకు గురవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80 వేల కోట్లు. కాగా మార్చి 2,3 తేదీల్లో జరిగే సమావేశంలో పివి నరసింహారావుకంతనపల్లి సుజల ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల స్కీంలకు పర్యావరణ అనుమతులు ఇచ్చే విషయమై ఆ శాఖ నిపుణుల బృందం నిర్ణయం తీసుకోనుంది. గత నెలలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిన విషయం విదితమే.