రాష్ట్రీయం

కాపీ కొడితే నాలుగేళ్లు డిబార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 27: ఇంటర్ పరీక్షలు మార్చి 1తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి బి ఉదయలక్ష్మి సోమవారం కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ నుంచి వివిధ జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే నాలుగేళ్ల డిబార్‌కు గురి కాగలరని హెచ్చరించారు. హాల్ టిక్కెట్లను తమ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చంటూ ఇందుకోసం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు పదవ తరగతి హాల్ టిక్కెట్ నంబర్‌ను, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరం హాల్ టిక్కెట్ నంబర్లను ఎంటర్ చేయడం ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అలాగే జిరాక్స్ మెషిన్ల షాపులను మూసివేస్తామని చెప్పారు. సెల్‌ఫోన్‌లకు అనుమతి లేదని అన్నారు. టోల్‌ఫ్రీ నెంబర్ 18002749868, కంట్రోల్ రూమ్ నెంబర్ 08662974130 లతో విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 1448 పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రథమ, ద్వితీ య సంవత్సర పరీక్షలకు 10 లక్షల 32వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.