రాష్ట్రీయం

బాబు అండతోనే రెచ్చిపోతున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ/పెనుగంచిప్రోలు, ఫిబ్రవరి 28: కృష్ణాజిల్లా ముండ్లపాడు వద్ద బస్సు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, బస్సు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన బస్సు ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి వారి బంధువులను పరామర్శించారు. పోస్టుమార్టం నివేదిక కాపీని వైద్యుల వద్ద నుండి ఆయన తీసుకోగా దీనికి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది డాక్టర్ కాపీ అని, కావాలంటే వేరేదిస్తామని చెప్పటంతో మూడు సెట్లు ఉండగా ఒక సెట్ ఇవ్వటానికి ఏమిటి భయమంటూ జగన్ ప్రశ్నించారు. ఈ సమయంలో కలెక్టర్ జోక్యం చేసుకోవటంతో జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 3కచ్చితంగా ఎంక్వైరీ చేయిస్తాం, రెండేళ్లలో నిన్ను సెంట్రల్ జైలుకు పంపిస్తా2మంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కొమ్ముకాస్తుండటం వల్లనే ప్రైవేటు బస్సు యాజమాన్యాలు ఇష్టానుసారంగా దొంగ పర్మిట్‌లతో వాహనాలు నడుపుతున్నాయన్నారు.4చనిపోయిన డ్రైవర్‌కు పోస్ట్‌మార్టమ్ చేయలేదు. రెండో డ్రైవర్ ఉన్నాడా? లేడా? ఉంటే వెళ్లగొట్టారా? అతనికి లైసెన్స్ ఉందా? ఏడాది క్రితం కేశినేని, అంతకుముందు దివాకర్ ట్రావెల్స్, ఇప్పుడు మళ్లీ ఇది. వాళ్లంతా టిడిపి ఎంపిలు కాబట్టి వారికి రూల్స్ ఉండవు. ఒక పర్మిట్‌తో ఒకే చోట రెండు మూడు బస్సులు రెండు మూడు రూట్లలో తిప్పుతారు. స్టేజ్ క్యారియర్లకు పర్మిషన్ లేకున్నా ఆపేసి ప్యాసింజర్లను ఎక్కించుకుంటారు. నాకు తెలిసి డ్రైవర్ కచ్చితంగా తాగి తోలి ఉండాలి. అందుకే పోస్టుమార్టమ్ చేయలేదు. రెండో డ్రైవర్‌ను అరెస్టు చేయలేదు. ఇలాంటి వారిని ప్రభుత్వం రక్షించడం సరికాదు. ఇలాంటి ట్రావెల్స్ యాజమాన్యాలకు వత్తాసు పలకడాన్ని అందరూ ఖండించాల2ని జగన్ అన్నారు. కాగా చంద్రన్నబీమా కింద మృతుల కుటుంబాలకు ఏపికి చెందిన వారైతే 3 లక్షలు, పక్క రాష్ట్రాల వారికైతే 2 లక్షలు ఇస్తామనడాన్ని ఒప్పుకోమని, యాజమాన్యంనుంచి 20 లక్షలు ఇప్పించాలని, క్షతగాత్రులకు 10 లక్షలు ఇప్పించాలని, అలా చేస్తేనే ప్రైవేట్ ట్రావెల్స్ మళ్లీ నిర్లక్ష్యంగా వ్యవహరించవని జగన్ స్పష్టం చేశారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే బస్సు రెండవ డ్రైవర్‌ను తప్పించారని ఆరోపించారు. యాజమాన్యాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆసుపత్రి వద్దకు చేరుకున్న జగన్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, వైకాపా అభిమానులు చేరుకున్నారు.
ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
జగన్ గో బ్యాక్ అంటూ తెదేపా కార్యకర్తలు నినాదాలు చేయటంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైకాపా, తెదేపా శ్రేణులు పరస్పర నినాదాలు చేయటంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

చిత్రం..మృతుల బంధువులతో మాట్లాడుతున్న జగన్మోహనరెడ్డి