రాష్ట్రీయం

నోట మాట రాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 28: కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని, తీవ్రంగా కలచి వేసిందని, నోట మాట రావడం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. భువనేశ్వర్ నుండి హైదరాబాద్ వస్తున్న ఈ ప్రైవేటు బస్సు వంతెనపై నుండి కల్వర్టులోకి పడటం చూస్తుంటే నోట మాట రాలేదని అన్నారు. 11 మంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీని కోసం ఆధునిక టెక్నాలజీని కూడా ఉపయోగించాలని అన్నారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు తగినంత పరిహారం అందించాలని, క్షతగాత్రులకు మేలైన వైద్య సాయం అందించాలని , మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నట్టు పేర్కొన్నారు.