తెలంగాణ

ఐకెపిలకు బంపర్ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 1: గ్రామీణ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో వివిధ పథకాలలో పని చేస్తున్న ప్రభుత్వ సిబ్బందికి ముఖ్యమంత్రి ప్రకటిస్తున్న వరాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇందిరా క్రాంతి పథకంలో (ఐకెపి) పని చేస్తున్న సహాయకులకు బుధవారం ముఖ్యమంత్రి వరాలు ప్రకటించారు. ఐకెపి ఆధ్వర్యంలోని గ్రామైక్య సంఘాలలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లుగా (వి.ఓ.ఎ) పని చేస్తున్న 18,405 మందికి వేతనాలు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రగతి భవన్‌లో బుధవారం ఐకెపి సహాయకులతో ముఖ్యమంత్రి సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఐకెపి సహాయకులకు ప్రస్తుతం రూ.500 నుంచి 1500 వేతనంగా చెల్లిస్తుండగా ఇక నుంచి వీరి వేతనాన్ని రూ.5000కు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. పెంచిన వేతనంలో రూ. 2 వేలు గ్రామైక్య సంఘాలు, రూ. 3 వేలు ప్రభుత్వం భరిస్తుందన్నారు.
ప్రభుత్వం తన వాటాను సెర్ఫ్ ద్వారా చెల్లించనుండగా, గ్రామైక్య సంఘాల వాటాను చెల్లించే బాధ్యతను సూపర్‌వేజర్లు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. దీంట్లో భాగంగా గ్రామాలలో డ్వాక్రా మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగు పర్చడానికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో మహిళా సంఘాలు బాగా నడుస్తున్నాయన్న పేరు తెచ్చుకున్నాయన్నారు. కేవలం పొదుపుతోనే సరిపెట్టుకోకుండా కుటీర పరిశ్రమలు నడపాలన్నారు. గ్రామాలలో లభించే ముడి సరకుల ఆధారంగా మార్కెట్ అవసరాలను తీర్చే విధంగా డ్వాక్రా సంఘాల మహిళలు ప్రాసెసింగ్ చేయాలన్నారు. కారంపొడి, పసుపు, పాపడాలు, కార, బొంది వంటి మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పదార్థాలను తయారు చేయాలన్నారు. వీటి ద్వారా ప్రజలకు కల్తీలేని సరుకులు, మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. డ్వాక్రా మహిళలకు అవసరమైన శిక్షణ, చేయూత అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాలతో పని చేస్తున్న డ్వాక్రా సంఘాలతో పాటు బంగ్లాదేశ్‌లో బాగా పని చేస్తున్న మహిళ సంఘాలపై అధ్యయనం చేయడానికి బృందాలను పంపిస్తామన్నారు. గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి హరీశ్‌రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.