తెలంగాణ

ఇంటర్ పరీక్షల్లో అగచాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 1: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షల తొలి రోజే బుధవారం విద్యార్థులు అనేక అగచాట్లు పడ్డారు. తొలి రోజు సెకండ్ లాంగ్వేజి పేపర్-1 నిర్వహించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంటర్మీడియట్ బోర్డు ఉపయోగించి విద్యార్ధుల సెంటర్ లొకేటర్ సదుపాయాన్ని కల్పించినా, పరీక్ష కేంద్రాల్లో సదుపాయాలపై దృష్టి సారించకపోవడంతో చీకటి గదుల్లో కూర్చుని పరీక్ష రాయాల్సి వచ్చింది. కూర్చునేందుకు సరైన సదుపాయాలను పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్ధులు నానా అగచాట్లు పడ్డారు. పరీక్ష కేంద్రాలను జోన్ల వారీ కేటాయించినా, విద్యార్ధులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోలేకపోయారు. హైదరాబాద్ ఆదిత్యభవన్ ఐఐటి ఫౌండేషన్ విద్యార్ధులు ఆలస్యంగా నిజాంపేటలోని శ్రీచైతన్య బాలికల కళాశాలకు చేరుకోవడంతో అక్కడి సిబ్బంది వారిని అనుమతించలేదు. దాంతో 23 మంది విద్యార్ధినులు ఎంతగా ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. బస్సు రిపేర్ కావడంతో చేరుకోవడం ఆలస్యమైందని వారు కోరినా యాజమాన్యం పరీక్షకు అనుమతించలేదు. చివరికి అసలు కాలేజీ జరిగిన సంగతిని తల్లిదండ్రులకు చెప్పకుండా రహస్యంగా ఉంచింది. విద్యార్ధుల ఫిర్యాదుతో వ్యవహారం వెలుగు చూసింది.
12 మందిపై మాల్‌ప్రాక్టీస్ కేసులు
తొలి రోజు జనరల్ , వొకేషనల్ కలిపి 4,75,832 మందికి బదులు 4,49,984 మంది మాత్రమే పరీక్ష రాశారు. 25,848 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. కాగా 12 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేశామని అధికారులు వివరించారు.
లంచం అడిగారు...యజమాని
ఇంటర్ బోర్డు అధికారులకు లంచం ఇవ్వకపోవడం వల్లనే తమ విద్యార్ధులకు హాల్‌టిక్కెట్లు జారీ చేయలేదని వాసవి కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆరోపించారు. హాల్‌టిక్కెట్లు జారీ చేయకపోవడానికి బోర్డు అధికారులే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. తనను అరెస్టు చేసినా ఫరవాలేదని, తనతో పాటు బోర్డు అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఏడాది జూన్‌లో పర్మిషన్ కోరుతూ ఇంటర్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నామని, కాలేజీ పరిశీలించడానికి వచ్చిన బృందం పర్మిషన్ ఇచ్చారని, అఫిలియేషన్‌కు మాత్రం లంచం డిమాండ్ చేశారని అన్నారు. తాను రెండు లక్షలు లంచంగా ఇచ్చానని, మరో ఐదు లక్షలు ఇవ్వాలని కోరారని, అప్పటి నుండి బోర్డు చుట్టూ తనను తిప్పించుకున్నారని అన్నారు. చివరికు ఈ ఏడాది ఫిబ్రవరిలో లాగిన్ ఇచ్చారని, ఇప్పుడేమో విద్యార్ధులకు హాల్‌టిక్కెట్లు ఇవ్వకుండా వారి భవిష్యత్‌ను నాశనం చేశారని ఆరోపించారు.
క్రిమినల్ చరిత్ర ఉంది: కార్యదర్శి
వాసవి కాలేజీ అధినేత శ్రీనివాస్‌కు క్రిమినల్ చరిత్ర ఉందని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఐదు లక్షలు లంచం తీసుకోవల్సిన అవసరం తనకు లేదని, పరీక్ష ఫీజు ఆలస్యంగా చెల్లించినందుకు జరిమానా 11 లక్షల వరకూ బకాయి ఉన్నారని అన్నారు.
అన్యాయం జరగకుండా చూస్తాం: ఉప ముఖ్యమంత్రి
ఇంకో పక్క వాసవి కాలేజీ విద్యార్ధుల భవిష్యత్ దృష్ట్యా అకడమిక్ ఇయర్ వృథా కాకుండా చూసుకుంటామని , అడ్వాన్స్‌సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. విద్యార్ధులను, ప్రభుత్వాన్ని మోసం చేసిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. పిల్లలను కాలేజీల్లో చేర్పించే ముందు ఆయా కాలేజీలకు గుర్తింపు ఉందా లేదా అనేది చూసుకోవాలని, కాలేజీల ట్రాక్ రికార్డు కూడా గమనించాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఎన్విరాన్‌మెంటల్ పేపర్, ఎథిక్స్ పేపర్, హ్యుమన్ వాల్యూస్ అనే పరీక్షకు ఈ కాలేజీ విద్యార్ధులు హాజరుకాలేదని అన్నారు. దీనికి 20 శాతం మార్కులు ఉంటాయని, ప్రాక్టికల్స్‌కు కూడా విద్యార్ధులు హాజరుకాలేదని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాలేజీ చేసిన తప్పులకు విద్యార్ధులు నష్టపోకూడదనేదే తమ ఉద్ధేశ్యమని చెప్పారు.