రాష్ట్రీయం

ఆ డ్రైవర్‌కు లైసెనే్స లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 3: ప్రకాశం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైన బస్సును నడిపిన డ్రైవర్‌కు అసలు లైసెనే్స లేదా? డ్రైవర్ పొంతన లేని సమాధానాలు ఈ అనుమానానికి బలం చేకూరుస్తున్నాయి. లైసెన్స్ ఉందా అనడిగితే ఇంట్లో ఉందని ఒకసారి, ఎక్కడో పెట్టానని మరోసారి చెబుతుండటంతో అసలు లైసెనే్స లేదని అధికారులు అనుమానిస్తున్నారు. పీసీ పల్లి మండలం పెదఅలవలపాడు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ప్రాణనష్టం లేకపోయినా, 47 మంది విద్యార్థులు గాయపడిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం వరకు డ్రైవర్ లైసెన్స్ చూపించలేదు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బస్సులో సీటింగ్ సామర్థ్యం 40 కాగా 80 మందితో ఆ బస్సు బయలుదేరింది. చిన్నారులు సీట్ల మధ్య ఇరుక్కుని కూర్చోవాల్సి వచ్చింది. ప్రమాదం అనంతరం రవాణాశాఖ జాయింట్ కమిషనర్ ఎస్‌ఎవి ప్రసాదరావు, ఇతర ఉన్నతాధికారులు విజయవాడ నుంచి సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. ఉలవపాడు మండలం కరేడులోని పోతల వెంకట సుబ్బయ్య శ్రేష్టి జడ్‌పి ఉన్నత పాఠశాల నుంచి ఆ బస్సు 28 తేదీ రాత్రి బయలుదేరింది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 2న బస్సు ప్రమాదానికి గురైంది. ఒకే డ్రైవర్ విశ్రాంతి లేకుండా బస్సు నడపటం కూడా ఈ ప్రమాదానికి కారణంగా చెప్పవచ్చు. డ్రైవర్ ఎస్‌కె కాలేషా వెళ్లేటప్పుడు కందుకూరు సమీపంలోని తన స్వస్థలం నుంచి తన కుమార్తెను వెంట తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో తన గ్రామం సమీపంలో రోడ్డుపైన బస్సు నిలిపి తన కుమార్తెను ఇంటికి తీసుకెళ్లి, వచ్చే సమయంలో ఒక మహిళను వెంట తీసుకువచ్చినట్టు తెలిసింది. ఆ మహిళను తన పక్కన కూర్చోబెట్టుకుని బస్సు నడుపుతుండగా తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో బస్సు బోల్తాపడింది. ఆ తర్వాత అక్కడకు చేరిన పోలీసులు ఆ మహిళ ఎవరని ప్రశ్నిస్తే తన భార్య అంటూ డ్రైవర్ బుకాయించాడు. అయితే కొంతసేపటికి అసలు భార్య అక్కడకు చేరుకుని విస్తుపోయింది. ఈవిడ ఎవరు అంటూ భర్తను నిలదీయగా అతనికి నోట మాట రాలేదు. డ్రైవర్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్ష చేసి, వైద్యాధికారులతో పరీక్ష జరిపించి ఎఫ్‌ఐఆర్‌లో ఆ అంశాన్ని కూడా పొందుపరిచామని అధికారులు చెబుతున్నారు.