రాష్ట్రీయం

తవ్వకాల్లో బయటపడిన శతాబ్దాల నాటి విగ్రహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, మార్చి 3: గద్వాల జిల్లా మక్తల్ మం డల పరిధిలోని మంథన్‌గోడ్‌లో స్థలం కోసం జరిపిన తవ్వకాల్లో అతిపురాతనమైన దేవతా విగ్రహాలు బయటపడ్డ సంఘటన స్థలాన్ని శుక్రవారం పురావస్తు శాఖ అధికారులు సందర్శించి అక్కడి విగ్రహాలను ఇతర ఆనవాళ్లను పరిశీలించారు. స్థల యజమాని గ్రామస్తుల అభిప్రాయం వేరకు తహశీల్దార్ ఓంప్రకాష్ సమక్షంలో పురావస్తు శాఖ అధికారులు పూర్తి సమాచారం కోసం శుక్రవాం మరోమారు తవ్వకాలను చేపట్టారు. స్థల యజమానులు ఈనెల 26 జరిపిన తవ్వకాల్లో శివలింగం, మహాశిష్ణు, వల్లి శుభ్రమణ్యం, నాగదేవత, నంది విగ్రహాలు బయటపడిన విషయం తెలిసిందే. కాగా అట్టి విగ్రహాలను అక్కడి ఇతర ఆనవాళ్లను పరిశీలించిన పురావస్తుశాఖ పిల్లలమర్రి మ్యూజి యం ఇంచార్జీ నాగేష్, జూనియర్ ఆసిస్టెంట్ బాల్‌రాజు అది 800 ఏళ్ల పురానత శివాలయం కావచ్చని అభిప్రయ పడ్డారు. పూర్తిస్థాయిలో తవ్వకాలు జరిపితే తప్పా లభించే అధారాలను బట్టి అక్కడ ఏగుడి ఉందో, ఏకాలం నాటిదో గుర్తించవచ్చన్నారు. గ్రామస్తుల అభిప్రాయం మేరకు తవ్వకాలు జరుపగా కొత్తగా ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. కాగా విగ్రహాలు లభించిన స్థలానికి కొద్ది దూరంలో ఓ కోనేరు ఉండటమే కాకుండా ఇళ్ల మధ్యన ధ్వజస్థంబం భూమి లో కూరుకుపోయి రెండు ఫీట్లు బయటకు ఉండటాన్ని పురావస్తు అధికారులు పరిశీలించారు. ఈసంఘటనపై పురావస్తుశాఖ ఏడి నాగరాజును ఆంధ్రభూమి సెల్‌ఫోన్‌లో సంప్రదించగా మంథన్‌గోడ్‌లో తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలను తమ సిబ్బంది పరిశీలించారన్నారు. కొత్తగా ఆధారాలు ఏమి లభించనప్పటికి అవి 12వ శతాబ్ధికి చెందినవిగా చెప్పారు. బయటపడ్డ విగ్రహాలను ప్రజలు ఏకాభిప్రాయం ద్వారా ప్రజల సందర్శనార్ధం పాలమూర్ పిల్లలమర్రి మ్యూజియంలో ఉంచుతామని తెలిపారు. తవ్వకాల్లో పురావస్తు శాఖ అధికారులు తహశీల్దార్‌తోపాటు విఆర్‌ఓ నర్సిములు, పంచాయతి కార్యదర్శి మల్లేష్, ఎంపిటిసి వెంకట్‌రాములు, సత్యనారాయణ ఆచారి, కృష్ణయ్య తదితరులు ఉన్నారు.

చిత్రం..మంథన్‌గోడ్‌లో బయటపడిన విగ్రహాలను పరిశీలిస్తున్న తహశీల్దార్ ఓంప్రకాష్, పురావస్తుశాఖ అధికారులు