రాష్ట్రీయం

మట్టిరోడ్డుపై మందుపాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాపురం, మార్చి 4: తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం పంచాయతీ రాచపల్లి- మల్లాపురం గ్రామాల మధ్య నుంచి పాలెం ప్రాజెక్టుకు వెళ్లే మట్టి రోడ్డుపై శనివారం ఉపాధిహామీ కూలీలు పని చేస్తుండగా మందుపాతర కనుగొన్నారు. కుడివైపున కొండ ప్రాం తం కోతులకొండ కాగా ఎడమవైపు మైదాన ప్రాంతం ఉంది. కొండపై భాగం నుంచి వైర్లు అమర్చిన మావోయిస్టులు మట్టి రోడ్డు మధ్యలో మందుపాతరకు కనెక్షన్ ఇచ్చారు. ఎడమ భాగంలో రోడ్డు పక్కన అటవీశాఖ ఆధ్వర్యంలో సుమారు 40 మంది ఉపాధి కూలీలు కందకాలు తవ్వుతుండగా ఉద యం 10 గంటల ప్రాంతంలో ఇద్దరు కూలీలు బహిర్భూమికి కుడివైపున ఉన్న పొదల్లోకి వెళ్తుండగా విద్యుత్ వైరు వారి కాళ్లకు తాకటంతో భయకంపితులైన వారు కందకాలు తవ్వుతున్న ఇతర కూలీలకు సమాచారం అందించారు. దీంతో మందుపాతర అమర్చిన ప్రదేశానికి 20 అడుగుల దూరంలో పనిచేస్తున్న కూలీలు ఒక్కసారిగా అక్కడే పనిముట్లు వదిలి పరుగులు తీశారు. సమాచారాన్ని సెల్‌ఫోన్ల ద్వారా వెంకటాపురం పోలీసులకు చెప్పడంతో సిఐ రవీందర్ ఆధ్వర్యంలో ఎస్సై బండారి కుమార్ అప్రమత్తమయ్యారు. ఆ రోడ్డుగుండా వాహనాలు, పశువులు, బాటసారుల రాకపోకలను పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. శనివారం సాయంత్రం వరకు పోలీసులు మందుపాతర అమర్చిన ప్రదేశానికి వెళ్లలేదని సమాచారం.

చిత్రం..రోడ్డుపై అమర్చిన మందుపాతర