ఆంధ్రప్రదేశ్‌

జాతీయ రహదారిగా మరో 1638 కిలోమీటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 5: ప్రస్తుత ఆర్థిక ముగిసేలోగా రాష్ట్రంలోని వివిధ అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తోంది. రహదారుల నిర్మాణానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అనుమతులను వీలైనంత త్వరగా పొందేందుకు నిర్ణయించింది. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ వేను జాతీయ రహదారిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరంది. సెంట్రల్ రోడ్డు ఫండ్ కింద 66 పనులను చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 848 కిలోమీటర్ల మేర పనులను 1000 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు వీలుగా నిధులను మంజూరు చేయాలని కోరింది. సేతు భారతం పథకం కింద ఇప్పటికే 15 ఫ్లైఓవర్లకు సంబంధించి సవివర నివేదికలను కేంద్ర రహదారులు, రవాణా మంత్రిత్వ శాఖను కోరారు. 1344 కిలోమీటర్ల మేర రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించడం, కనకదుర్గ ఫ్లైఓవర్ వద్ద వయాడక్టు, ఇతర పనులను 30 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు వీలుగా నిధుల మంజూరు చేయమని కోరారు. 2530 కోట్ల రూపాయల మేర పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలను, 1638 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని నిర్మించేందుకు వీలుగా మార్చిలోగా అనుమతులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ఇప్పటికే కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ అధికారులతో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత ధావ్ర ఢిల్లీలో సంప్రదింపులు జరిపారు.

3 ఎమ్మెల్సీ స్థానాలూ మావే
కెఇ, అచ్చెన్నాయుడు జోస్యం
కర్నూలు సిటీ, మార్చి 5: కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంతో పాటు పశ్చిమ రాయలసీమ పట్ట్భద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలను సైతం కైవసం చేసుకుంటామని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. కర్నూలులో వారు ఆదివారంనాడు విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కెఇ మాట్లాడుతూ కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 85శాతం టిడిపికే మెజార్టీ ఉందన్నారు. అయితే వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కేవలం తన ఉనికి కాపాడుకోవటం కోసమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని పోటీలో నిలిపారన్నారు. జిల్లాలో ప్రస్తుతం టిడిపికి 8 మంది ఎమ్మెల్యేలతో పాటు జడ్పీటిసి, ఎంపిటిసి సభ్యులు దాదాపు 85 శాతం టిడిపి వైపే మొగ్గు చూపుతున్నారని, దీంతో శిల్పా సులువుగా విజయం సాధిస్తారని తెలిపారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పార్టీలో ఎటువంటి అంతర్గత కలహాలు లేవని అందరూ ఐకమత్యంగా ఉన్నారని వెల్లడించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు అందరినీ సమన్వయపరచి వారి అభీష్టం మేరకే ఎమ్మెల్సీ అభ్యర్థులను బరిలోకి దించారన్నారు.