ఆంధ్రప్రదేశ్‌

కలాం సేవలు నిరుపమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), మార్చి 5: సామాన్యుడుగా తన జీవితాన్ని ప్రారంభించిన మాజీ రాష్టప్రతి, శాస్తవ్రేత్త ఎపిజె అబ్దుల్ కలాం యావత్ ప్రపంచానికి వెలకట్టలేని సేవలందించారని, ఆయన ప్రపంచం మెచ్చిన మహామేధావి అని విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ శ్లాఘించారు. స్వయంకృషి, పట్టుదల, అచంచలమైన ఆత్మవిశ్వాసంతో అంచలంచెలుగా ఎదిగి అత్యున్నతమైన పరిశోధనలు చేసి, భారతదేశ ప్రతిష్ఠను ఆయన ఇనుమడింపచేశారని ఘనంగా నివాళి అర్పించారు. గుంటూరుకు సమీపంలోని చినకొండ్రుపాడు వద్ద విశ్వనగర్‌లో ఆదివారం సాయంత్రం 6.22 గంటలకు విమ్స్ ప్రాంగణంలో రెండున్నర అడుగుల కలాం కాంస్య విగ్రహాన్ని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి విశ్వంజీ ఆవిష్కరించారు. ఈసందర్భంగా పెద్దసంఖ్యలో హాజరైన ప్రముఖులు, విమ్స్ వైద్య బృందం, భక్తులకు కలాం ఔన్నత్యాన్ని విశ్వంజీ వివరించారు. భరతమాత సేవలో తరించిన అత్యున్నత శాస్తవ్రేత్తల్లో అబ్దుల్ కలాం ఎప్పుడూ ప్రథమ స్థానంలో ఉంటారన్నారు. మానవత్వ సమానత్వాన్ని, విశ్వజనీనమైన భావనలను ఎల్లప్పుడూ గౌరవించి, ఆదరించి, అభిమానించే ప్రతిఒక్కరి హృదయంలో కలాం సుస్థిర స్థానాన్ని సముపార్జించుకున్నారని విశ్వంజీ చెప్పారు. విశ్వనగర్‌ను అబ్దుల్ కలాం సందర్శించిన సందర్భాన్ని స్వామీజీతో పాటు పలువురు ప్రముఖులు గుర్తుచేసుకున్నారు. మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ విశ్వనగర్‌లో భారతరత్న అబ్దుల్ కలాం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. విశ్వంజీ ఆలోచనలు, వారి ఆశయం, సంకల్పం యావత్ మానవాళికి ఎల్లప్పుడూ శ్రేయోదాయకంగా నిలిచిపోతాయన్నారు. దేశానికి, ప్రపంచానికి విశిష్ఠ సేవలందిస్తున్న మహనీయులను గుర్తుపెట్టుకోవడమే కాకుండా కలాం వంటి అంతర్జాతీయ శాస్తవ్రేత్తను, భారతదేశ కీర్తిప్రతిష్ఠలను ఖండాంతరాలకు వ్యాపింపజేసిన గొప్ప నేతను స్మరించుకోవటం సంతోషదాయకమన్నారు. ఈ విగ్రహాన్ని ప్రముఖ శిల్పి, ఇటీవల ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పురస్కారం అందుకున్న టివి కృష్ణ సుబ్బారావు తయారుచేశారు. కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే, సిబిసిఐడి ఎస్పీ కోటేశ్వరరావు, విశ్వమానవ సమైక్యతా సంసత్ కన్వీనర్ ఆకుల కోటేశ్వరరావు, ఆకుల ఈశ్వరి, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ మెంబర్, మాజీ ఇన్‌కం ట్యాక్స్ డిజి డాక్టర్ పి రఘు, కేరళ మాజీ డిజిపి సుబ్బారావు, ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ, డాక్టర్ రాజరాజేశ్వరి, విమ్స్ వైద్య బృందం పాల్గొన్నారు.

చిత్రం... విశ్వనగర్‌లో భారతరత్న డా. ఎపిజె అబ్దుల్ కలాం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న విశ్వయోగి విశ్వంజీ మహరాజ్, శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్. చిత్రంలో ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ, తదితర ప్రముఖులు