రాష్ట్రీయం

ఎన్నికల నియమావళి ఉల్లంఘించారంటూ ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌పై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీగల్ (కరీంనగర్), మార్చి 7: ఎన్నికల నియమావళి ఉల్లంఘించారంటూ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై కరీంనగర్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు సిసి.నం.1/2017 కింద కేసు నమోదు చేసింది. నగరానికి చెందిన సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి 11-7-2016న కరీంనగర్ స్పెషల్ మెజిస్టేట్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. 19-6-2016న ఓ టివి ఛానల్ చూస్తుండగా కోడెల శివప్రసాద్ ఇంటర్వ్యూ ప్రసారం జరుగుతోంది. టివి యాంకర్ అడుగుతున్న ప్రశ్నలకు కోడెల సమాధానం చెబుతూ 1983లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కేవలం 30 వేల మాత్రమే ఖర్చయినవని, అవి కూడా గ్రామాల నుండి చందాల రూపంలో వచ్చాయని అన్నారు. అలాంటివి నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో 11.50 కోట్లు ఖర్చయ్యాయని సమాధానం చెప్పారు.
దీనిని వీక్షించిన భాస్కర్ రెడ్డి 11.50 కోట్లు ఒక ఎమ్మెల్యే పదవి పొందడానికి ఎలా ఖర్చు చేశాడని, ఎన్నికల కమిషన్ నిర్ణయించిన ఖర్చుకంటే 40 రెట్లు ఎక్కువ ఖర్చు చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. న్యాయస్థానం ఎన్నికలకు సంబంధించిన న్యాయస్థానానికి కేసు బదిలీ చేయగా కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు.
దీనిని పరిశీలించిన రాష్ట్ర హైకోర్టు కేసు విచారణకు స్వీకరించాలని చీఫ్ జూడీషియల్ మెజిస్ట్రేట్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు కోడెల శివప్రసాద్‌పై కేసు నమోదు చేసి ఎన్నికల వివాదాల గురించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ మొబైల్‌కోర్టు (పిసిఆర్)కు బదిలీ చేసింది. దీనిపై విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి సతీష్ కుమార్ వచ్చే నెల 20న కోర్టుకు హాజరుకావాలని స్పీకర్ కోడెలకు సమన్లు జారీ చేశారు.