రాష్ట్రీయం

మరో టిడిపి నేతను సిఎంను చెయ్యండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: ఓటుకునోటు కేసులో తెలంగాణ ఏసిబి దాఖలు చేసిన రెండవ చార్జిషీటులో కూడా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును 22 సార్లు, మొదటి చార్జిషీటులో 26 సార్లు ప్రస్తావించిందని, అందువల్ల చంద్రబాబు నైతిక విలువలకు లోబడి వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. గురువారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ తాను నిప్పు అని పదే పదే చెప్పుకునే చంద్రబాబు ఇప్పటికైనా విచారణను ఎదుర్కొని నిప్పో, తుప్పో తేల్చుకోవాలన్నారు. సంఖ్యాపరంగా టిడిపికి మెజార్టీ ఉందని, వేరొకరిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టుకోవచ్చని ఆయన కోరారు. రాష్ట్రప్రజలకు మంచి సందేశం ఇవ్వాలంటే చంద్రబాబు పదవవి నుంచి తప్పుకోవడం మేలన్నారు. ఓటుకు నోటు కేసు కుట్ర మహానాడులో ప్రారంభమై హైదరాబాద్‌లో ఒక నక్షత్రాల హోటల్ వరకు జరిగిన సంఘటనలపై 139 పేజీల చార్జిషీటులో వివరించారన్నారు. ఈ కేసు తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోజరుగుతున్న వరుస పరిణామాలు చూసిన వారికెవరికైనా చంద్రబాబు ఎందుకు భయపడుతన్నారో అర్ధమవుతుందన్నారు.