రాష్ట్రీయం

ఉగ్రవాదానికి ఇస్లాం వ్యతిరేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 11: ఇస్లాం మతం తీవ్రవాదానికి వ్యతిరేకమని, ఉగ్రవాదంపై పోరుకు సిద్ధం కావాలని శనివారం నాడిక్కడ జరిగిన అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక సదస్సులో పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మజ్లిస్-ఎ-ఉలెమా-ఎ-హింద్, ఆలిండియా సున్ని ఉలెమా వా సూఫియా బోర్డు సంయుక్త్ధ్వార్యంలో జరిగిన సదస్సలో ఇరాన్, కువైట్, భారత్‌లోని ఇస్లామిక్ స్కాలర్‌లు ప్రసంగించారు. వౌల్వి ఆగా ఎస్‌హాగ్ మదాని (ఇరాన్) మాట్లాడుతూ, ఇస్లాం ఎప్పు డూ శాంతినే బోధిస్తుందని, శాంతి, సామరస్యమే ఇస్లాం మత సిద్ధాంతమని అన్నారు. కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ఇస్లాం మతాన్ని అంతమొందించేందుకు దాడులకు పాల్పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హజ్ ముస్త్ఫా గులాం (కువైట్) మాట్లాడుతూ, ఇస్లాం పవిత్ర స్థలాలపై దాడులకు పాల్పడుతోన్న ఉగ్రవాదాన్ని అంతమొందించాలన్నారు. ఇస్లాం ఆవిర్భవించి సర్వజనుల సంక్షేమం కోసమనని, ఒక జాతి, ఒక ప్రాంతం, ఒక మతం కోసం కాదన్నారు. శాంతి సందేశాన్నిస్తూ, సర్వజనులకోసం తపించేదే ఇస్లాం అని అన్నారు. ముస్లిం దేశాలపై అమెరికా ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ప్రజాచైతన్యం ముఖ్యమన్నారు. అఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఇరాన్, సిరియా, పాలస్తీనా, గయ వంటి దేశాలపై దాడులు నిర్వహిస్తూ అధికార పెత్తనం సాగించుకోవడం ఇస్లాంకు వ్యతిరేకమన్నారు. తాలిబన్లు, అల్‌ఖైదా, ముజహద్దీన్, ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలను నిషేధించి, ఉగ్రవాదం పట్ల ఆకర్షితులవ్వకుండా యువతను కాపాడుకోవాలని ఆయన సూచించారు. ఇంకా ఈ సదస్సులో జార్ఖండ్, వెస్ట్‌బెంగాల్, ఢిల్లీ, లక్నో, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఇస్లాం స్కాలర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దస్ సవాలాత్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అంతర్జాతీయ సదస్సుకు హాజరైన వక్తలకు జ్ఞాపికలను బహూకరించారు.