తెలంగాణ

రేవంత్, సండ్ర సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 11: అసెంబ్లీ నుంచి టిడిపి పక్షం నాయకుడు ఎ. రేవంత్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సస్పెన్షన్‌కు గురయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు వీరిద్దరిని సస్పెండ్ చేస్తూ సభ తీర్మానం ఆమోదించింది. రేవంత్ రెడ్డి సస్పెన్షన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని విపక్షాలు చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చింది. దీంతో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సహా బిజెపి, సిపిఎం సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సస్పెన్షన్‌కు గురైన సభ్యులు బేషరతుగా క్షమాపణ చెబితే ఆలోచిస్తామని అన్నారు. ఎపి అసెంబ్లీ నుంచి వైకాపా ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేస్తే టిడిపికి మిత్రపక్షంగా ఉన్న బిజెపి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మహారాష్టల్రో గవర్నర్ ప్రసంగానికి ఆటంకపరిచిన సభ్యులను రెండేళ్ళ పాటు సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు.శనివారం ఉదయం అసెంబ్లీ ప్రారంభంకాగానే మంత్రి టి. హరీశ్‌రావు ప్రసంగిస్తూ శుక్రవారం ఉదయం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు టిడిపి ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య రన్నింగ్ కామెంటరీ చేస్తూ పదేపదే అడ్డుపడ్డారని తెలిపారు. కాబట్టి వారిరువురిని ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్ చేయాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో స్పీకర్ మధుసూదనా చారి తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా మూజువాణి ఓటుతో ఆమోదించినట్లు ప్రకటించి, సస్పెన్షన్‌కు గురైన రేవంత్ రెడ్డిని సభ నుంచి వెళ్ళాల్సిందిగా సూచించారు. ఆ సమయంలో సండ్ర సభలో లేరు. రేవంత్ రెడ్డి ఏమీ మాట్లాడకుండా సభలో నుంచి వెళ్లిపోయారు.ఇలాఉండగా రేవంత్ రెడ్డి సస్పెన్షన్ పట్ల సిఎల్‌పి నాయకుడు, ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. అధికారంలో ఉన్న పార్టీ సభ్యులు ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. సస్పెన్షన్ చేసే ముందు కనీసం అన్ని పక్షాల నేతల అభిప్రాయాన్ని తీసుకుని ఉంటే బాగుండేదని చెప్పారు. స్పీకర్ కల్పించుకుని గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు నిరసన తెలియజేయవచ్చు కానీ ఆటంక పరచరాదని అన్నారు. ఇందుకు రూల్స్ ఉన్నాయని ఆయన తెలిపారు. తిరిగి జానారెడ్డి ప్రసంగిస్తూ సస్పెన్షన్ అప్రజాస్వామికం అవుతుందని, దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిందిగా కోరారు. తాము కూడా ఆటంక పరిచినట్లు అన్నారని ఆయన తెలిపారు. తాము సభ గౌరవ, మర్యాదల ప్రకారమే నడుచుకున్నామని, సభ నుంచి బయటకు వెళ్ళామని, ఆ సమయంలో వాకౌట్ అని చెప్పేందుకూ అవకాశం లేదని అన్నారు. అలాగైతే గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో అధికార పక్షం సభ్యులు బల్లలు చరచడం ఆటంకపరచడం కాదా? అని ఆయన ప్రశ్నించారు. సభ్యుల సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం సుముఖంగా లేనందున తాము ఈ చర్యను నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నామని జానారెడ్డి ప్రకటించి తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సభ నుంచి బయటకు వెళ్ళారు.
కూర్చొని నిరసన తెలిపితే..
బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడ్డారని సస్పెండ్ చేయడం భావ్యం కాదని అన్నారు. తమ స్థానాల్లో కూర్చొని నిరసన తెలిపే హక్కు కూడా లేదంటే ఎలా అని ప్రశ్నించారు. గతంలో సభలో పేపర్లు చింపి గవర్నర్‌పైకి విసిరి వేశారని ఆయన ఉదహరించారు. సభ్యుల సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. మహారాష్టల్రో కాంగ్రెస్ సభ్యుడు గవర్నర్‌ను కొట్టడంతో గాయమై రక్తం కారిందని, ఫలితంగా సస్పెండ్ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి సభ నుంచి బయటకు వెళ్ళారు. సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కూడా సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో సభ నుంచి ఆయన వాకౌట్ చేశారు.
కలిసిపోయిన టిడిపి-కాంగ్రెస్
మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ టిడిపి సభ్యులను సస్పెండ్ చేయడంతో కాంగ్రెస్ వాకౌట్ చేసిందని, దీంతో ఆ రెండు పార్టీలు కలిసి పోయాయని తెలుస్తున్నదని హరీశ్‌రావు అన్నారు.