రాష్ట్రీయం

పోలవరానికి నిధులు ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఒక అడుగు ముందుకు, మూడడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల మంజూరును నిలిపివేయలని ప్రధాని కార్యాలయం ఆదేశించినట్టు తెలిసింది. ఇప్పటికే నిధుల లేమితో ప్రాజెక్టు నత్తనడక నడుస్తుంటే, తాజా ఆదేశాలతో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని తెలుగుదేశం ఎంపీలు వాపోతున్నారు. గూడ్స్ అండ్ సర్వీసు టాక్స్ బిల్లు (జిఎస్‌టి) ఆమోదమే తక్షణ కర్తవ్యంగా భావిస్తున్న కేంద్రం, పార్లమెంటులో బిజూ జనతా దళ్ మద్దతు తప్పనిసరి అని భావిస్తోంది. ఈ క్రమంలో బిజెపి నాయకత్వం వ్యూహాత్మకంగా పావులు కదిపింది. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే ఒరిస్సాకు చెందిన అటవీ ప్రాంతం గ్రామాలు పెద్దఎత్తున ముంపునకు గురవుతాయని, తాము పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకమని చెబుతూ గత మూడు నెలలుగా నిరవధికంగా సమ్మె చేస్తున్న బిజెడి నేతలను చల్చబర్చే చర్యలను కేంద్రం మొదలెట్టింది.
పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఒరిస్సాలో అధికారంలో ఉన్న బిజెపి నేతలు భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్ ఎదుట కొద్ది రోజులుగా దీక్షలు, ధర్నాలు చేస్తున్నారు. పోలవరం వల్ల 7వేల గిరిజన కుటుంబాలు నిరాశ్రయం అవుతాయని, సుమారు 7656 హెక్టార్ల అటవీ ప్రాంతం మునిగిపోతుందని, అలాగే 26 గ్రామాలను తరలించాల్సిన పరిస్థితి వస్తుందని వాదిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చాలా కాలంగా బిజూ జనతా దళ్ వ్యతిరేకిస్తోంది. పతాకస్థాయి అన్నట్టు ఒరిస్సా సిఎం నవీన్ పట్నాయక్ సైతం తన ట్విట్టర్ ఖాతాలో నిరసనలను ప్రమోట్ చేశారు. పోలవరం నిరసిస్తూ ఒరిస్సా అట్టుడికిపోతోంది. ఈ పరిస్థితిని బిజెపి తమకు అనుకూలంగా మలుచుకుని బిజెడిని ఆకట్టుకునే చర్యలు చేపట్టింది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఆపేయాలని ప్రధాని కార్యాలయం జలవనరుల శాఖను ఆదేశించిందని తెలిసింది.