రాష్ట్రీయం

ఐసెట్ షెడ్యూలులో మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ ఐసెట్‌ను మే 18న నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తులను మార్చి 14 నుండి స్వీకరిస్తామని కన్వీనర్ ప్రొఫెసర్ కె ఓంప్రకాష్ తెలిపారు. అభ్యర్ధులు కేవలం రిజిస్ట్రేషన్ రుసుంతో మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకూ స్వీకరిస్తామని, ఇతరులు 350 రూపాయిలు, ఎస్సీ-ఎస్టీలు 250 రూపాయిలు చెల్లించాలని చెప్పారు. 500 రూపాయిల అపరాధ రుసుంతో ఏప్రిల్ 24 వరకూ, రెండు వేల రూపాయిల రుసుంతో మే 2వ తేదీ వరకూ, 5వేల రూపాయిలు రుసుంతో మే 8వ తేదీ వరకూ, అంతిమంగా 10వేల రూపాయిల రుసుంతో మే 14వ తేదీ వరకూ అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. గతంలో ప్రకటించినట్టే మే 18న ప్రవేశపరీక్ష నిర్వహిస్తమని ఓంప్రకాష్ తెలిపారు. ఇందుకు సంబంధించిన సమాచారానికి ఐసెట్ డాట్ సిఎస్‌సిహెచ్‌ఇ డాట్ ఎసి డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. మే 21న తొలి కీ ప్రకటిస్తామని, మే 27 వరకూ అభ్యంతరాలను స్వీకరించి, తుది కీ, ఫలితాలను మే 30న ప్రకటిస్తామని చెప్పారు.
రేపటి నుండి ఒంటిపూట బడులు
15వ తేదీ నుండి తెలంగాణలో ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖాధికారులు తెలిపారు. మార్చి 15 నుండి ఏప్రిల్ 23 వరకూ ఒంటిపూట బడులు నడుస్తాయి. 2017-18 విద్యాసంవత్సరానికి సంబంధించి మార్చి 21న ఖరారు చేస్తారు. మార్చి 16 నుండి 20 వరకూ పాఠ్యపుస్తకాల పంపిణీ, బుక్ బ్యాంకు పంపిణీ చేపడతారు.