రాష్ట్రీయం

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 17:నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. కడప జిల్లాలో హోరాహోరీగా ప్రచారం సాగటంతో ముందుజాగ్రత్త చర్యగా అసాధారణ పోలీస్ బందోబస్తు ఏర్పాటైంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో సిసి కెమెరాలు, వెబ్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉండటం అటుంచి రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించారు. తొలిసారిగా నాన్ ఎనలైజర్ డిటెక్టర్స్‌తో సబ్ డివిజన్లలో సైడ్ ట్రాకింగ్ ఫోర్స్ దళాలను మోహరింపజేశారు.
కర్నూలు డిఐజి రమణకుమార్ కడప జిల్లాలోనే మకాం వేశారు. వైఎస్‌ఆర్ జిల్లాలో జమ్మలమడుగులో 304 ఓట్లకు 304, రాజంపేటలో 228కి 228 ఓట్లు, కడపలో 308కి 307 ఓట్లు పోలయ్యాయి. కర్నూలు జిల్లా ఆదోనిలో 391కి 389 ఓట్లు, నంద్యాలలో 307కు 304, కర్నూలులో 386కు 384 ఓట్లు పోలయ్యాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 140కి 140, నాయుడుపేటలో 111కు 111 ఓట్లు, గూడూరులో 182కి 182 ఓట్లు, నెల్లూరులో 261కి 260 ఓట్లు, కావలిలో 158కి 158 ఓట్లు పోలయ్యాయి.

చిత్రం..కడప జిల్లా జమ్మలమడుగులోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తున్న వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి