రాష్ట్రీయం

నీళ్లిచ్చి తీరుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ చార్మినార్, మార్చి 18: తెరాస ప్రభుత్వం ఇదివరకే ప్రజలకిచ్చిన వాగ్దానం మేరకు 2018నాటికి వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి నీళ్లివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగేది లేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మరోసారి శాసన మండలిలో స్పష్టం చేశారు. బడ్జెట్‌పై సభ్యుల ప్రశ్నకు ఆయన వివరణ ఇస్తూ ఉద్యమం, పోరాటాలు చేసుకుని సాధించుకున్న తెలంగాణ కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి పర్చుకునేందుకు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోని అంకెలను పట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షం అంటే అధికారపక్షం ఏది చేసినా అందులో లోపాలను వెతికి పట్టుకోవాలన్న వైఖరిని మాని, ప్రజలకు తమ సమస్యలు పరిష్కారం కాగలవన్న నమ్మకాన్ని కల్గించేలా హూందాగా వ్యవహారించాలని హితవు పలికారు. అర్థంలేని ఆరోపణలు, విమర్శలు చేస్తున్న కాంగ్రెస్, ఏ ఒక్కటి రుజువు చేసినా తాను రాజీనామా చేసేందుకు సిద్ధమేనన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో ఏ ప్రభుత్వం చేయని తరహాలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చేందుకు చేతి వృత్తుల వారికి బడ్జెట్‌లో నిధులు భారీగా కేటాయిస్తే, విపక్షాలు వారిని కించపర్చేలా మాట్లాడుతున్నాయని, అది సరైన పద్ధతి కాదని సూచించారు. నిలువ నీడలేని పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించి విపక్షాలు చేసిన విమర్శలు తలకిందులయ్యేలా 2018కల్లా 2 లక్షల 16 వేల ఇళ్ల నిర్మించి తీరుతామని ఈటల పునరుద్ఘాటించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ, కేటాయింపులకు తగిన విధంగా అభివృద్ధి పనులు చేపడుతూ నిర్మాణాత్మకంగా వ్యవహారించని కాంగ్రెస్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తామన్నారు. గత పాలకులు అరవైయేళ్లు రాష్ట్రాన్ని పాలిస్తే, అందులో కాంగ్రెస్ 40 ఏళ్లు, తెదేపా 20 ఏళ్లు పాలించినా, ఒక్కో కుటుంబానికి ఏకంగా రూ.5 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు లబ్ది పొందేలా ఏ ఒక్క కార్యక్రమాన్నైనా చేపట్టారా? అన్ని ప్రశ్నించారు. ఈ రెండు పార్టీల హయాంలో కేవలం రూ.73.66 కోట్లను వెచ్చించి 1246 కోట్ల భూమి కొనుగోలు చేయగా, తెరాస ప్రభుత్వం కొత్త రాష్ట్రంలో 9664 ఎకరాల స్థలాలను కొనుగోలు చేసి దళితులకు పంపిణీ చేసినట్టు వివరించారు. తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలొస్తాయని ఎదురుచూసిన నిరుద్యోగులకు ప్రభుత్వం గడిచిన రెండున్నరేళ్లలో 42 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని, మరో 60వేల మందికి ఉద్యోగాలిచ్చే అంశంపై కసరత్తు కొనసాగుతోందని వివరించారు.
వికలాంగులకు కల్యాణలక్ష్మి
పేదింటి ఆడ పిల్లల పెళ్లిళ్లు గగనంగా మారిన నేటి తరుణంలో, అలాంటి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికంగా సాయం అందిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ స్కీంలను వికలాంగులకూ వర్తింపజేయాలని పలువురు సభ్యులు కోరగా, మంత్రి ఈటల ఇందుకు సానుకూలంగా స్పందించారు. వారికి కూడా స్కీం వర్తింపజేసేలా స్టడీ చేసి తగు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.